Shruti haasan: చీరలో వయ్యారాలు వలకబోస్తున్న శృతి... హాట్ బ్యూటీ ట్రెండ్ మార్చిందే!

Published : Apr 09, 2023, 07:10 PM IST

స్టార్ లేడీ శృతి హాసన్ ట్రెండ్ మార్చారు. చీరల్లో దర్శనమిస్తూ సరికొత్తగా సోయగాలు పరిచయం చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి మెస్మరైజ్ చేశారు.   

PREV
15
Shruti haasan: చీరలో వయ్యారాలు వలకబోస్తున్న శృతి... హాట్ బ్యూటీ ట్రెండ్ మార్చిందే!
Shruti Haasan


సన్నజాజి తీగలా ఉండే శృతి హాసన్ చీర కట్టగా చీరకే అందమొచ్చింది. స్టార్ కిడ్ పరువాలు మరింత హైలెట్ అయ్యాయి. ఆమె కవ్వించే చూపులు మనసులు కొల్లగొట్టాయి. శృతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

25
Shruti Haasan


శృతి కెరీర్ గాడిన పడగా ఆ ఆనందం కళ్ళలో కనిపిస్తుంది. టాలీవుడ్ ఆమెకు అక్కున చేర్చుకుంది. గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినా... క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. 
 

35
Shruti Haasan


ఇక ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు విజయాలు సాధించాయి.  మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటించినందుకు గాను రూ. 5 కోట్ల వరకు చెల్లించారట. కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ తో పాటు ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.

45
Shruti Haasan


ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు. 
 

55
Shruti Haasan

గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

click me!

Recommended Stories