30 కోట్ల బడ్జెట్ 300 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా, ఇండస్ట్రీని ఊపేస్తున్న సైయారా

Published : Jul 29, 2025, 03:37 PM IST

పెద్దగా బడ్జెట్ పెట్టలేదు, ప్రమోషన్స్ చేయలేదు, స్టార్స్ కూడా నటించలేదు. కంటెంట్ ఉంటే చాలు సినిమాలు హిట్ అవ్వడానికి అని నిరూపించింది ఓ చిన్న సినిమా.

PREV
15

ప్రస్తుతం బాలీవుడ్ మీద టాలీవుడ్ సినిమాల దండయాత్ర కొనసాగుతుంది. హిందీ సినిమాలు పాన్ ఇండియాను ఆకట్టుకోలేకపోతున్న తరుణంలో సౌత్ సినిమాలు ఆ స్థానం ఆక్రమించుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాపవుతూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న తరుణంలో, ఇతర భాషల సినిమాలు బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను సంపాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమా సైయారా అద్భుత విజయం సాధించి, బాలీవుడ్‌కు ఒక పాజిటివ్ ఊపు తెచ్చిపెట్టింది.

DID YOU KNOW ?
చిన్న సినిమా పెద్ద విజయం
దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సైయారా సినిమా 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
25

కంటెంట్ ఉంటే చాలు.. సినిమా జనాలకు గట్టిగా ఎక్కేస్తుంది అని ఈసినిమా నిరూపించింది. బడ్జెట్ పెద్దగా పెట్టలేదు, ప్రచారం ఎక్కువగా చేయలేదు, స్టార్స కూడా ఈ సినిమాలో నటించలేదు. అయినా సరే ప్రస్తుతం ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేస్తోంది సైయారా మూవీ. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా ఇప్పటి వరకు 260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

35

ఈ సినిమా పెద్దగా ప్రచారం లేకుండా విడుదలై, తన కంటెంట్‌ బలంతోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. కథ పరంగా చూస్తే ఇది ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ. పాత తరహా కథే అయినప్పటికీ, దర్శకుడు మోహిత్ సూరి కొత్తగా స్క్రీన్‌ప్లే సిద్ధం చేసి, ఈ జనరేషన్‌కు సరిపోయేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు.సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా లవ్ ప్రపోజ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆ ఒక్క సీన్ కోసమే సినిమా చూడవచ్చు” అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఇది సినిమా హైప్‌కు దోహదపడింది.

45

కథ ప్రకారం, హీరో, హీరోయిన్ ప్రేమలో పడతారు. ఈక్రమంలో కొన్ని సంఘటనల కారణంగా హీరోయిన్ గతం మర్చిపోతుంది. కొత్తగా ఇంకొకరిని ప్రేమించడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరికి ఆమె మళ్లీ హీరోను గుర్తుపట్టిందా..? అసలు వీరు కలుస్తారా? అనే అంశమే కథ బలం.ఈ కథతో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ, సైయారా ప్రత్యేకత దాని ప్రజెంటేషన్. ప్రతి షాట్ కొత్తగా ఉండటం, ఫీల్ గుడ్ మూడ్‌ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ కలిసి సినిమా విజయం దిశగా నడిపించాయి.

55

ఇంకా మహేష్ బాబు, సుకుమార్ లాంటి ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పించడంతో ఈ చిన్న సినిమాకు తెలియకుండా గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమా సక్సెస్ చిన్న సినిమాల నిర్మాతలకు మంచి మోటివేషన్ ఇచ్చేలా మారింది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుంది అనే విషయాన్ని సైయారా మరోసారి నిరూపించింది.

Read more Photos on
click me!

Recommended Stories