బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన బాంద్రా ఇంట్లో దాడికి గురైన ఘటనపై గురువారం రాత్రి పోలీసులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ఘటనపై సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వివరణాత్మక సమాచారం అందించినట్లు సమాచారం.
26
కరీనా కపూర్ ఖాన్
బాంద్రాలోని సద్గురు చరణ్ భవనంలోని 11వ అంతస్తులో ఉన్న తన ఇంటి బెడ్ రూమ్‌లో భార్య కరీనా కపూర్ ఖాన్‌తో మాట్లాడుతుండగా, తన చిన్న కుమారుడు జహంగీర్‌ను చూసుకునే పనిమనిషి అరుపులు వినిపించాయి.
36
సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
వెంటనే తన కొడుకు గదికి వెళ్లి చూడగా, అక్కడ వారు దొంగ పిడిలో ఉన్నారు. పనిమనిషి ఎలియామా ఫిలిప్స్ భయంతో అరుస్తుండగా, జెహ్ ఏడుస్తున్నాడు.
46
పోలీసుల దర్యాప్తు
నేను ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతను నా వీపు, మెడ, చేతులపై చాలాసార్లు పొడిచాడు అని ఆయన చెప్పారు. గాయాలు ఉన్నప్పటికీ, నటుడు ఆ వ్యక్తిని గదిలోకి నెట్టగలిగాడు, అదే సమయంలో ఫిలిప్స్ జెహ్‌ను తీసుకొని మరొక గదిలో తనను తాను బంధించుకుంది.
56
సైఫ్ అలీ ఖాన్ దాడి
ఆ వ్యక్తి తనను ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసి బెదిరించాడని సైఫ్ అలీఖాన్ చెప్పారు. తన ఇంట్లో పనిచేసేవారు ఆ దొంగను బంధించిన గదిని తెరిచి చూసేసరికి అతను అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నాడని చెప్పారు. తర్వాత, భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ దేశస్థుడు షెరిఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) అలియాస్ విజయ్ దాస్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
66
సైఫ్ అలీ ఖాన్ వాంగ్మూలం
సైఫ్ అలీఖాన్ వాంగ్మూలం వెలుగులోకి రావడంతో నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కోటీశ్వరుడైన సైఫ్ అలీఖాన్ పలు లగ్జరీ కార్లు కలిగి ఉన్నా, ఆటోలో ఎందుకు వచ్చారు. భార్య కరీనా కపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, 7 ఏళ్ల కొడుకు తైమూర్ తీసుకెళ్లడానికి కారణం ఏమిటి అని పలు ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సైఫ్ అలీఖాన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.గతంలో సైఫ్ అని ఆసుపత్రికి తీసుకెళ్లింది తన పెద్ద కొడుకు ఇబ్రహీమ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో తైమూర్ అని చెబుతున్నారు. దీనితో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.