SSMB29:లుక్ టెస్ట్ పూర్తి చేసిన ప్రియాంక, ఏ పాత్రకు అంటే

Published : Jan 25, 2025, 07:46 AM IST

ప్రియాంకను SSMB29 ఈ సినిమాలోకి తీసుకోవటం వెనక అసలు కారణం..ఆమె ఆల్రెడీ హాలీవుడ్ లో సినిమాలు చేయటమే అంటున్నారు. దాంతో బిజినెస్ పరంగనే కాకుండా, క్రేజ్ పరంగనూ వరల్డ్ మీడియా అటెన్షన్ ఈ సినిమాపై పడనుంది. 

PREV
15
 SSMB29:లుక్ టెస్ట్ పూర్తి చేసిన ప్రియాంక, ఏ పాత్రకు అంటే
Mahesh Babu, Priyanka Chopra, SSMB29


బాలీవుడ్‌లో భారీ స్టార్‌గా వెలిగి ఆ తర్వాత హాలీవుడ్‌ కు షిప్ట్ అయ్యి అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రియాంక చోప్రా బిజీ అయ్యారు. అమెరికాకు చెందిన నిక్‌ జొనాస్‌ను వివాహం చేసుకున్నారు. లాస్‌ ఏంజెల్స్​ నుంచి ఆమె కొన్ని రోజుల కిందట హైదరాబాద్​కు వచ్చారు.

సూపర్​ స్టార్​ మహేశ్‌ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌)లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల చాలా వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారంటూ నెట్టింట పలు చర్చలు కూడా జరిగాయి. ఇంతకీ ప్రియాంక చోప్రా హైదరాబాద్ రావటానికి గల అసలు కారణం ఏమిటి..ఇక్కడ వారం ఉండి ఏం చేసింది అనే విషయాలు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.
 

25
actress Priyanka Chopra


 ప్రియాంక ఇలా  హఠాత్తుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.  మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్‌. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని హీరోయిన్ గా ఫిక్స్‌ చేశారని భోగట్టా. 
 

35


ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ కి సంభందించిన విషయాల కోసమే ఆమె వచ్చారనే  వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రియాంక చోప్రా ఏం చేసింది అంటే లుక్ టెస్ట్ లో పాల్గొంది అని తెలుస్తోంది. లుక్ టెస్ట్ లో ఆమె పాసైన తర్వాత ఆమె డేట్స్ , మిగతా వివరాలు మాట్లాడదామని రాజమౌళి చెప్పారట. దాంతో తానే స్వయంగా వచ్చి మరి లుక్ టెస్ట్ లో పాల్గొంది ప్రియాంక చోప్రా అని తెలుస్తోంది. లుక్ టెస్ట్ లో ఆమె తను అనుకున్నట్లే వచ్చిందని రాజమౌళి ఆనందం వ్యక్తం చేసారని చెప్తున్నారు. 

45

ప్రియాంకను ఈ సినిమాలోకి తీసుకోవటం వెనక అసలు కారణం..ఆమె ఆల్రెడీ హాలీవుడ్ లో సినిమాలు చేయటమే అంటున్నారు. దాంతో బిజినెస్ పరంగనే కాకుండా, క్రేజ్ పరంగనూ వరల్డ్ మీడియా అటెన్షన్ ఈ సినిమాపై పడనుంది. ఈ సినిమాలో ఆమె భారతీయ మూలాలు ఉన్న  ఆఫ్రికాకు చెందిన ఓ యువరాణి పాత్రలో కనిపించవచ్చు అనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి.  ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

55


 ఆ సినిమాను ఉద్దేశించే ప్రియాంక చోప్రా  కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు ఆ పోస్టును చూసి కామెంట్లను పెడుతున్నారు. రామ్‌ చరణ్‌, ప్రియాంక కలిసి గతంలో ‘జంజీర్’ (తెలుగులో తుఫాన్‌) సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. 

click me!

Recommended Stories