సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి దొరికాడు..? ఎవరు చేశారు..? కారణం ఏంటో తెలుసా..?

Published : Jan 17, 2025, 08:40 PM IST

ఇండియాన్ స్టార్ హీరో.. సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి గాయపరిచిన వ్యక్తి ఎట్టకేలకు దొరికాడు. అతన్నిముంబయ్ పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ అతను ఎవరు..? ఎందుకు ఈ దాడి చేశాడు..? 

PREV
15
సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి దొరికాడు..? ఎవరు చేశారు..? కారణం ఏంటో తెలుసా..?
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి, ఆయనపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు.

Also Read: రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి రిపేర్లు,

25
సైఫ్ ను పొడిచిన దొంగ

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దొంగ సైఫ్‌ని ఆరుసార్లు కత్తితో పొడిచాడని సమాచారం.

Also Read: కంగనా రనౌత్ లైఫ్ సీక్రేట్ నుబయటపెట్టిన ప్రభాస్

35
ఆసుపత్రిలో సైఫ్

దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని, సైఫ్‌పై దాడి చేసే ముందు ఇంట్లో పనిచేసే వారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేసి పరారయ్యాడు.

Also Read: 

45
CCTV ఫుటేజ్

12వ అంతస్తు నుండి దొంగ కిందికి వెళ్తున్న దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. దీంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సైఫ్ ఇంటి సెక్యూరిటీ గార్డులు, ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు విచారించారు.

Also Read: 

55
దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనానికి వచ్చాడా లేక సైఫ్‌ని చంపడానికే వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. CCTV ఫుటేజ్ ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.

 

click me!

Recommended Stories