ఇక సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీ కోసం వెచ్చించే ఖర్చుకు సంబంధించి కూడా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం సైఫ్ తన సెక్యూరిటీ కోసం ఏడాదికి రూ. కోటి ఖర్చు చేస్తారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు తమ సెక్యూరిటీ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారన్న అంశం తెరపైకి వచ్చింది. అందరి కంటే అధికంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన సెక్యూరిటీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హీరో ఏటా ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. తర్వాత సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్‌ల కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.