సహజ నటి సాయి పల్లవి
టాలీవుడ్, కోలీవుడ్ లో నేచురల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. సినిమాల విషయంలో, మేకప్ విషయంలో, తన మార్క్ చూపిస్తుంటు హీరోయిన్. అవకాశం వచ్చింది కదా అని పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, కోట్లు వెనకేసుకోవాలి అనే ఆలోచన సాయి పల్లవిలో ఉండదు. మంచి కథ, యాక్టిగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంతే కాని ముఖానికి ఎక్కువగా రంగులు పులుముకోవడం, పొట్టి డ్రెస్సులు ధరించడం వంటి ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ఆమె దూరంగా ఉంటుంది. అయితే సాయి పల్లవి రెగ్యులర్‌గా వాడే రెండు మేకప్ ప్రోడక్ట్స్ గురించి మీకు తెలుసా?