జాతీయ వైద్యుల దినోత్సవం 2026 సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల సేవలను గుర్తుచేసుకుంటున్నాం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు. సాయిపల్లవి నుంచి రాజశేఖర్ వరకూ యాక్టర్లుగా ఉన్న డాక్టర్లు ఎవరెవరంటే?
చదువు, నటనను విజయవంతంగా బ్యాలెన్స్ చేసిన నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఆమె MBBS పూర్తి చేశారు. వైద్య పట్టా పొందినా, నటనపై ఆసక్తితో ఇటువైపు వచ్చారు. మలయాళ బ్లాక్‌బస్టర్ 'ప్రేమమ్'తో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత 'ఫిదా', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్', 'అమరన్' వంటి తెలుగు, తమిళ చిత్రాల్లో అద్భుతంగా నటించారు. గ్లామర్‌కు దూరంగా, అర్థవంతమైన పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. సాయి పల్లవి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
26
రీసెంట్ గా MBBS పూర్తి చేసిన శ్రీలీల
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించిన నటి శ్రీలీల, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో తన మార్క్ నటనతో దూసుకుపోతోంది శ్రీలీల. చాలా తక్కువ టైమ్ లోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది. ఇక ఆమె తల్లి గైనకాలజిస్ట్ కావడంతో, శ్రీలీలకు చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగింది. తన తల్లి ప్రేరణతో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఈ మధ్య కాలంలోనే పట్టా పొందిన శ్రీలీల, ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టింది. వైద్య నేపథ్యం నుండి వచ్చిన ఆమె, ఇతర నటీమణుల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది.
36
అదితి గోవిత్రికర్
నటిగా, మోడల్‌గా సక్సెస్ కాకముందే అదితి గోవిత్రికర్ MBBS పట్టా పొందారు. 2001లో 'మిసెస్ వరల్డ్' టైటిల్ గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 'పహేలీ', 'దే దనా దన్' వంటి చిత్రాల్లో నటించారు. వినోద రంగంలో పేరు సంపాదించినప్పటికీ, తన వైద్య విద్య ద్వారా నేర్చుకున్న ఆరోగ్య సూత్రాలను, ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను ఆమె తరచుగా ప్రస్తావిస్తుంటారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రత్యేక నటనతో, యాంగ్రీ మ్యాన్ ఇమేజ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండు రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు రాజశేఖర్. సినిమాల్లోకి రాకముందు రాజశేఖర్. ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి, వైద్యుడిగా ప్రాక్టీస్ కూడా చేశారు. ఆయన సినిమాల్లోకి వచ్చాక కూడా పలువురికి వైద్య సేవలు అందించినట్లు ఇండస్ట్రీలో పేరుంది.
56
భరత్ రెడ్డి
చాలా మంది నటుల్లా కాకుండా, భరత్ రెడ్డి సినిమాల్లోకి రాకముందు కార్డియాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేశారు. వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్నా, నటనపై ఉన్న ఆసక్తి ఆయన్ని సౌత్ ఇండస్ట్రీ వైపు నడిపించింది. 'బిజినెస్‌మ్యాన్', 'స్పైడర్' వంటి తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీ బ్లాక్‌బస్టర్ 'జవాన్'లోనూ ఆయన గుర్తుండిపోయే సహాయ పాత్రలు పోషించారు. వైద్యంలో నైపుణ్యం, నటనలో అభిరుచి రెండూ సాధ్యమేనని ఆయన ప్రయాణం చూపిస్తుంది.
66
ఆశిష్ గోఖలే
ఆశిష్ గోఖలే ఒకవైపు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే, మరోవైపు నటుడిగానూ రాణిస్తున్నారు. ఆయన ముంబైలోని అడ్వాన్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కార్డియాక్ కేర్ సెంటర్‌కు సీఈఓ, మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో, నటనకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, ఫ్రంట్‌లైన్‌లో రోగులకు చికిత్స అందించారు. వైద్య వృత్తిలో అంత బిజీగా ఉన్నప్పటికీ, 'షైతాన్', 'భోళా', 'రైడ్ 2', '420 IPC' వంటి చిత్రాలతో పాటు 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడుతూ, తెరపై ప్రేక్షకులను అలరించడం ఆయనకే చెల్లింది.