స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ మృణాల్ ఠాకూర్ చాలా అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోతుంది. ఆమె అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఆ సీక్రెట్ ఒక డ్రింక్‌లో ఉంది. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి?
మృణాల్ ఠాకూర్ చాలామంది ప్రేక్షకులకు అభిమాన నటి. ఎంతో మందికి ఇష్టమైన తారలలో ఒకరు. ఆమె స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ అద్భుతంగా కనిపిస్తుంది. ఆమె ఒక స్కిన్‌కేర్ జంకీ, తన చర్మాన్ని ఒక ప్రొఫెషనల్‌లా చూసుకోవడానికి ఇష్టపడుతుంది.
25
స్కిన్ కేర్ లో మృణాల్ స్పెషల్ డ్రింక్..
సినిమాల్లో అందంగా కనిపించడానికి మృణాల్ చాలా కష్టపడుతుంది. వరుసగా సినిమాలు చేయడం, గంటల తరబడి మేకప్ వేసుకోవడం వల్ల ఆమె చర్మం చాలా ఒత్తిడికి గురవుతుంది. అందుకే మంచి స్కిన్‌కేర్ రొటీన్‌తో పాటు, తన చర్మం మెరుపు తగ్గకుండా ఈ స్పెషల్ డ్రింక్ తీసుకుంటుంది.
35
చియా సీడ్స్ జ్యూస్ వల్ల..
ట్వీక్ ఇండియాకు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో, మృణాల్ తనది పొడి చర్మం అని చెప్పింది. అందుకే ఆమె చియా సీడ్స్, ఇసబ్ గోల్ పొట్టును (husk) మంచి నీటిలో నానబెట్టుకుని తాగుతుంది.
మృణాల్ తన ముఖానికి బొప్పాయి మాస్క్, తేనె లేదా పంచదార స్క్రబ్ వేసుకోవడానికి ఇష్టపడుతుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండగా, బ్రౌన్ షుగర్ మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది.
55
ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తుందంటే?
ఈ చిట్కాలే కాదు, మృణాల్ ఫిట్‌నెస్ కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తన ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, కోర్ స్ట్రెంత్‌ను మెరుగుపరచుకోవడానికి ఆమె పైలేట్స్ చేస్తుంది. ఆమె త్వరలో 'డెకాయిట్: ఎ లవ్ స్టోరీ'లో కనిపించనుంది. ఇది అడివి శేష్ హీరోగా నటిస్తున్న యాక్షన్-హెవీ హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం.