సాయి పల్లవి మరోసారి వార్తల్లోకి వచ్చింది. మీడియా మొత్తం ఆమె గురించే మాట్లాడుతోంది. అందుకు కారణం ఆమె చేసిన అమరన్ సినిమాలో ....ఆమె చేసిన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది అమరన్. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
హడావిడి ,హంగామా లేకుండా సైలెంట్‌గా థియేటర్‌లో విడుదలైన అమరన్‌కు తెలుగులో కూడా హిట్ టాక్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓపినింగ్స్ రావడం విశేషం. అయితే ఇదంతా తెలుగు లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం అనేది నిజం. ఈ నేపధ్యంలో సాయి పల్లవి మరో తెలుగు సినిమా కమిటైందనే వార్త బయిటకు వచ్చింది. ఆ వివరాలు చూద్దాం.
25
Sai pallavi, amaran, Dulquer Salmaan
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిధా చిత్రంతో సాయి పల్లవి తెలుగులోకి వచ్చింది. భానుమతి హైబ్రీడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ 'ఫిదా' చిత్రంతో దుమ్ము రేపింది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట మారు మ్రోగుతుంటాయి. సాయి పల్లవి తెలుగులో తొలి చిత్రంతోనే అందరికి నచ్చేసింది. ఆ తరువాత నటించిన ప్రతి చిత్రంలోనూ తన మార్క్ నటనను కనబరుస్తూ ఇక్కడ అభిమానులను పెంచుకుంది.
సెలిక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రేమమ్, ఫిధా సక్సెస్ ల తర్వాత తెలుగు, మళయాళ, భాషల్లో ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా... ఎంత రెమ్యునరేషన్ ఇస్తాను అన్నా కథ నచ్చందే ఆమె చేయటం లేదు. కేవలం తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే సెలెక్టివ్‌గా చేస్తూ వస్తున్న ఆమె తెలుగులో సినిమా కమిటవటంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. ఇంతకీ ఎవరిదా సినిమా.
35
Sivakarthikeyan,sai pallavi, Amaran,kamal hassan
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సాయి పల్లవి...తెలుగులో దుల్కర్ ప్రక్కన సినిమా చేయటానికి కమిటైంది. మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తాజా తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ నిన్నే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అటు అమరన్ లోనూ సాయి పల్లవికి మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరు కాంబినేషన్ లో ఇప్పడు సినిమా రాబోతోంది.
45
Sai Pallavi
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts), స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా ( Light Box Media) సంయుక్త నిర్మాణంలో పవన్ సాధినేని (pavan sadineni ) దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్ (Dulquer Salmaan) ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలో ఇప్పుడు సాయి పల్లవి చేస్తూండటంతో మరింత క్రేజ్ ఈ ప్రాజెక్టు కు రాబోతోంది.
55
Sai Pallavi
అమరన్ చిత్రం విషయానికి వస్తే...ఇందులో రెబెకా వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకుంది, అమరన్ చిత్ర కథ కూడా సాయి పల్లవి కోణంలోనే కొనసాగుతుంది. ఈ చిత్రంలో సైనికుడి భార్యగా ఆమె నటనకు అందరూ అభినందిస్తున్నారు.
తెలుగు మార్కెట్ కు ఆమే ప్లస్ అయ్యింది. త్వరలోనే నాగచైతన్యతో ఆమె కలిసి నటించిన తండేల్ చిత్రం కూడా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది. దర్శకుడు చందు మొండేటి ఆమె పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసారని తెలుస్తోంది.