గౌతమ్ కి బుర్రలేదు అంటూ గంగవ్వ కామెంట్.. ప్రేరణ విరుచుకుపడడంతో టేస్టీ తేజ కన్నీళ్లు.. 

First Published | Oct 31, 2024, 11:07 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8లో 60వ రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రేరణ ముందు హరితేజ, టేస్టీ తేజ నిలువలేకపోయారు. ముందుగా 60వ రోజు అవినాష్, రోహిణి అల్లరితో ప్రారంభం అయింది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8లో 60వ రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రేరణ ముందు హరితేజ, టేస్టీ తేజ నిలువలేకపోయారు. ముందుగా 60వ రోజు అవినాష్, రోహిణి అల్లరితో ప్రారంభం అయింది. వీళ్ళిద్దరూ చిన్న పిల్లలుగా మారాలని.. వీళ్ళని ఇతర ఇంటి సభ్యులు మెప్పించాలని బిగ్ బాస్ ఆదేశించారు. అవినాష్.. యాష్మిని ఆంటీ ఆంటీ అంటూ ఆటపట్టించాడు. చిన్న పిల్లలుగా వీళ్ళిద్దరూ బాగా నవ్వించారు. 

ఆ తర్వాత బిగ్ బాస్ తాడో పేడో అనే టాస్క్ ఇచ్చారు.ఈ టాస్క్ లో టీం గ్రీన్ తేజ, టీం ఎల్లో నుంచి రోహిణి, టీం బ్లూ నుంచి నిఖిల్, టీం రెడ్ నుంచి గౌతమ్ పాల్గొన్నారు. టాస్క్ లో భాగంగా కింద పడేసిన తాడు ముక్కలని ఏరుకుని పెద్ద తాడుగా చేసుకోవాలి. మధ్యలో ఉంచిన బాక్స్ ని ఆ తాడు సాయంతో లాక్కోవాలి. ఈ టాస్క్ లో నిఖిల్ విజయం సాధించాడు. బిగ్ బాస్ షరతుల ప్రకారం టీం రెడ్ నుంచి ఒకరు తప్పుకోవాల్సి వచ్చింది. యాష్మి, ప్రేరణ గేమ్ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. వాళ్లిద్దరూ అంగీకరించలేదు. దీనితో గౌతమ్ బలి అయ్యాడు. 

Latest Videos


గేమ్ నుంచి తప్పుకున్నందుకు గౌతమ్ బాగా ఫీల్ అయ్యాడు. అది గమనించిన గంగవ్వ.. విష్ణుప్రియతో గౌతమ్ కి బుర్రలేదు.. యాష్మి, ప్రేరణతో గట్టిగా మాట్లాడాల్సింది అని కామెంట్ చేసింది. చివరికి మెగా చీఫ్ కంటెండర్స్ గా హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ లకు అవకాశం వచ్చింది. మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ బాగా ఫిజికల్ అయింది. వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్ ని మోస్తూ వీళ్లంతా ఒక బాల్ చుట్టూ రౌండ్ గా తిరగాలి. అలా తిరుగుతూ ఇతరుల బ్యాగ్స్ పై అటాక్ చేసి వాటిని ఖాళీ చేయొచ్చు. ఎవరి బ్యాగ్ ఖాళీ అవుతుందో వాళ్ళు పోటీ నుంచి తప్పుకోవాలి. 

ముందుగా నిఖిల్, ప్రేరణ.. హరితేజని టార్గెట్ చేశారు. హరితేజ బ్యాగ్ ఖాళీ అయింది. హరితేజ కూడా తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే ప్రేరణ ఆమెకి బాగా డ్యామేజ్ చేసింది. దీనితో హరితేజ తప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత ప్రేరణ.. టేస్టీ తేజని టార్గెట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య బాగా ఫిజికల్ అటాక్ జరిగింది. తేజ కొన్నిసార్లు కింద కూడా పడిపోయాడు. ఒకవైపు నుంచి ప్రేరణ.. మరోవైపు నుంచి నిఖిల్ తేజని టార్గెట్ చేశారు. 

ప్రేరణ అయితే కసిగా తేజపై అటాక్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. దీనితో తేజ బ్యాగ్ ఖాళీ అయింది. అతడు గేమ్ నుంచి తప్పుకున్నాడు. మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ కోల్పోవడంతో పాటు తనని టార్గెట్ చేసి అటాక్ చేయడంతో టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గంగవ్వ, అవినాష్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. 61 ఎపిసోడ్ లో అంటే శుక్రవారం రోజు మిగిలిన కంటెండర్స్ నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ మధ్య మెగా చీఫ్ పోరు కొనసాగనుంది. 

click me!