ప్రస్తుతం టాలీవుడ్‌కి పెద్ద దిక్కు అనే వాళ్లు ఎవరూ లేరంటున్నారు మోహన్‌బాబు. ఇప్పుడు ఎవరికి వాళ్లే పెద్ద అని చెబుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి పెద్ద అనే రోజులు ఆయనతోనే పోయాయని తెలిపారు. మరి మోహన్‌బాబు ఈ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటి? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనేది ఆసక్తికరంగా మారింది. మోహన్‌బాబు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఆరేడేళ్ల క్రితం వరకు దర్శకరత్న దాసరి నారాయణ రావుని ఇండస్ట్రీ పెద్దగా పిలిచేవారు. ఏ సమస్య ఉన్నా ఆయన సాల్వ్ చేసేవారని, బయటకు రాకుండా ఆయనే మ్యానేజ్ చేసేవాళ్లని అంటుంటారు. ఇలా ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోల సమస్యలు, జూ ఆర్టిస్ట్ లు, ఇతర 24 క్రాఫ్ట్ లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఆయన వద్ద పరిష్కారం దొరికేదని, ఆయన మాట అంతా వినేవాళ్లని అంటుంటారు. అది చాలా వరకు నిజం.
150కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించడం, అద్భుతమైన టాలెంట్‌కి కేరాఫ్‌గా నిలవడం, ధైర్యం, మాటలో నమ్మకం ఆయన సొంతం. దీనికితోడు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా ఏజ్ పరంగా, ఇమేజ్ పరంగా, స్టేటస్ పరంగా, అనుభవం పరంగా, అధికారం పరంగానూ ఆయన ఓ పెద్ద స్థాయిలో ఉన్నారు. అందుకే ఆయన మాటని అంతా విన్నారు. కొన్నాళ్లపాటు దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్దగా నిలిచారు. కానీ ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు.
Mohan babu
అయితే చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. మెగాస్టార్‌గా రాణిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం, అంతటి స్టార్ ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు సుమారు ఐదు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. పొలిటికల్ రిలేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఆయన మాటని ఎవరూ కాదనరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఆయనే ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలని చాలా మంది కోరుకున్నారు.
కానీ ఈ విషయంలో పెద్ద వివాదం నడిచింది. `మా` ఎన్నికల సమయంలో మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటి చేస్తుండగా, ఆయనకు చిరు సపోర్ట్ ఇవ్వలేదని, ఆయనకు పోటీగా ప్రకాష్ రాజ్‌ని దించారనే విషయంలో మంచు ఫ్యామిలీకి, ఆయన వర్గానికి, చిరంజీవి ఫ్యామిలీకి మధ్య వివాదం చోటు చేసుకుంది. పరోక్షంగా ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. హాట్ కామెంట్లు చేసుకున్నారు. ఆ సమయంలోనే ఇండస్ట్రీకి తాను పెద్దగా ఉండను, ఒక బిడ్డగా ఉంటానని ప్రకటించారు చిరంజీవి.
Rajamouli
కానీ `ఆర్‌ఆర్‌ఆర్` సమయంలో టికెట్ల సమస్య వచ్చినప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని సెటిల్ చేశాడు. దీంతో ఎవరు అనుకున్నా, కాదన్నా, ఆయన వద్దు అనుకున్నా మా దృష్టిలో చిరంజీవినే ఇండస్ట్రీ పెద్ద అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. దీనికితోడు కరోనా సమయంలో మెగాస్టార్ ముందుండి, ఇండస్ట్రీని కలుపుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం తాను అలా భావించడం లేదనే చెబుతున్నారు.
మరోవైపు ఇటీవల చిరంజీవి `ఏఎన్నార్` జాతీయ అవార్డుని అందుకున్నారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవాల్లో తనకు లెజెండరీ పురస్కారం ఇవ్వాలనుకున్నారని, కానీ కొందరికి అది నచ్చలేదని, దీంతో తనకు ఆ అర్హత లేదని, ఆ పురస్కారాన్ని అక్కడే సమాధి చేశానని,
తనకు అర్హత వచ్చినప్పుడే స్వీకరిస్తానని చెప్పానని, ఇప్పుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు వచ్చాక ఆ పరిపూర్ణం ఏర్పడిందని, ఇప్పుడు రచ్చ గెలిచాను, ఇంటా గెలిచాను అని తెలిపారు చిరంజీవి. మెగాస్టార్ అన్న ఈ వ్యాఖ్యలు.. అప్పుడు మోహన్‌బాబుని ఉద్దేశించే అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ కామెంట్స్ కి లింక్ చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మోహన్‌బాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరని, అది దాసరి నారాయణరావుతోనే పోయిందని తెలిపారు మోహన్‌బాబు. ఎన్ని జన్మలెత్తినా మరో దాసరి నారాయణరావు లాంటి వారు రారు, రాలేరు అని తెలిపారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
చిరంజీవి ప్రయత్నిస్తున్నారుగా అని ఆర్కే అడగ్గా, అది నాకు అనవసరం అన్నారు మోహన్‌బాబు. అంతేకాదు మా మధ్య పుల్లలు పెట్టండి అంటూ ఆయనకు ఝలక్ ఇచ్చాడు. దాసరి నారాయణ తర్వాత ఇండస్ట్రీ పెద్ద అనేవాళ్లు లేరు, లేరు, రారు, రాబోరు అంటూ మరోసారి స్పష్టం చేశారు మోహన్ బాబు.
చిరంజీవితో గొడవ మళ్లీ స్టార్ట్ అయ్యిందా అనే ప్రశ్నకి స్పందించలేదు. తనకు అవసరం ఉంటే చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పడం విశేషం. ఆ మధ్య సినిమా సెట్ కి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్ల నేపథ్యంలో ఇప్పుడు పాత మోహన్‌బాబు వ్యాఖ్యలు వైరల్ కావడం గమనార్హం.
Read more:ఆఫీస్ బాయ్ కారణంగా హిట్ కొట్టిన చిరంజీవి, ఫ్లాప్‌లో ఉన్న టైమ్‌లో అది పెద్ద ఊరటే!
Also read: స్టార్ హీరోయిన్‌తో రాజేంద్రప్రసాద్‌కి ఉత్తమ జంటగా సత్కారం.. ఇంటికెళ్లాక నటకిరీటి భార్య ఏం చేసిందో తెలుసా?