సాయి పల్లవి ఎనర్జీ సీక్రెట్ ఇదే ? రోజుకు 2 లీటర్లు ఏం తాగుతుందో తెలుసా?

మేకప్ అనేది లేకుండా నేచురల్ బ్యూటీతో కట్టిపడేస్తుంది సాయి పల్లవి. సహజమైన అందం, సింప్లిసిటీకి ఆమె ఫేమస్. హెల్తీ లైఫ్‌స్టైల్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వటం గురించి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సాయి పల్లవి.. తాను అంత స్ట్రాంగ్ గా, హెల్దీగా, రోజంతా హుషారుగా ఉండటానికి కారణం అయిన  ఎనర్జీ సీక్రెట్ డ్రింక్ గురించి సీక్రేట్ బయటపెట్టింది. 
 

Sai Pallavi's Natural Beauty and  Energy Secret Revealed Coconut Water in telugu jms


Sai Pallavi  Energy Secret Natural Drink:  తెలుగులో డాన్స్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన సాయి పల్లవి, మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  తన సహజమైన అందం, సింపుల్ లైఫ్‌స్టైల్‌కు ఫేమస్. ఆమె మొటిమలు ఉన్న ముఖం, మేకప్ లేని లుక్ ఆమె అందాన్ని మరింత పెంచుతున్నాయని ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. 

Also Read: రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?

ప్రేమమ్ చేసిన మ్యాజిక్:

సాయి పల్లవి ఫస్ట్ మూవీ 'ప్రేమమ్' సినిమాలో ఆమె చేసిన మ్యాజిక్, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణమైంది. దీనితో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. సినిమాలో నిలదొక్కుకోవడానికి గ్లామర్ రోల్స్‌లో నటించాలనే అభిప్రాయాన్ని సాయి పల్లవి బ్రేక్ చేసింది. సాంప్రదాయ దుస్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.

Also Read: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?


అమరన్ చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందా?

సాయి పల్లవి నటించిన అమరన్, తండేల్ సినిమాలు ఆమె కెరీర్‌లో ఒక మాస్టర్ పీస్ లాంటివి. ఈ సినిమాలలో ఏదో ఒక సినిమాకి  సాయి పల్లవి ఖచ్చితంగా  జాతీయ అవార్డు సాధిస్తుందని ఆమె అభిమానులు నమ్ముతున్నారు.  ఇక అమరన్ సినిమాలో సాయి పల్లవి నటన శివ కార్తికేయన్ నటనను కూడా డామినేట్ చేసిందని సినిమా విమర్శకులు అన్నారు.
 

తండేల్ సినిమా 100 కోట్ల వసూళ్లు:

ఈ సినిమా సక్సెస్ తర్వాత, తెలుగులో నాగ చైతన్యతో కలిసి 'తండేల్' సినిమాలో నటించింది. ఈ సినిమా నాగ చైతన్యకు 100 కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టింది. చేపలు పట్టే ఫ్యామిలీకి చెందిన యువతిగా  ఈసినిమాలో సాయి పల్లవి నటన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

నాగ చైతన్య చెప్పిన సీక్రెట్:

తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో హీరో నాగ చైతన్య సాయి పల్లవి సీక్రేట్ ఒకటి బయటపెట్టారు. సాయి పల్లవి రోజుకు కనీసం ఐదు లీటర్ల కొబ్బరి నీళ్లు తాగుతుందని సరదాగా అన్నాడు. దాంతో  సాయి పల్లవి నవ్వింది. అంత ఎక్కువ కాదు, కానీ రెండు లీటర్ల కొబ్బరి నీళ్లు మాత్రం రెగ్యులర్‌గా తాగుతానని ఆమె చెప్పింది. సాయి పల్లవి అందానికి, ఫిట్‌నెస్‌కు ఇదే కారణమని అంటున్నారు.

2 లీటర్ల కొబ్బరి నీళ్లతో షూటింగ్ స్పాట్‌కు సాయి పల్లవి

షూటింగ్ స్పాట్‌కు వెళ్లేటప్పుడు కూడా 2 లీటర్ల బాటిల్‌లో కొబ్బరి నీళ్లు తీసుకుని వెళ్తుందట. తన సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి సాయి పల్లవి తన డైట్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజూ ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకుంటుంది. ఆమె అంత ఎనర్జీతో పనిచేయడానికి కారణం మాత్రం కొబ్బరినీళ్ళే అని చెప్పాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!