Sikander title track is out now
Sikandar Twitter Review: బాలీవుడ్ కండల వీరిడు సల్మాన్ ఖాన్ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించని సినిమా సికందర్. ఈసినిమా సల్మాన్ ఖాన్ కు ఎంతో సెంటిమెంట్ రోజు అయిన ఈద్ సందర్భంగా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రంజాన్ పండుగ కానుకగా మార్చి 30 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈలోపు ప్రీమియర్ షోల ద్వారా సినిమా చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ లో తమ అభిప్రాయాలు చెపుతున్నారు. ఆంతకీ వారు ఏమంటున్నారంటే.?
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రల్లో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ చాలా మంది కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ప్రిమియర్స్ చూసిన ఆడియన్స్ మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ హిట్ అంటుంటే..మరికొంత మంది మాత్రం ఏంటీ సినిమా అంటూ పెదవి విరుస్తున్నారు.
Sikandar
సికందర్ సూపర్ హిట్ అయినట్టే అని అంటున్నారు ఓ నెటిజన్. సల్మన్ ఖాన్ గత సినిమాలకంటే ఇది చాలా బాగుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించారు. పాటలు కూడా బాగున్నాయి. సినిమా అంతా అద్భుతంగా ఉంది అంటున్నాడు. సికందర్ ఓ అద్భుతం అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మురగదాస్ ఒక పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ను అందించారని, ఇక బీజీఎం అయితే థియేటర్లు దద్దరిల్లేలా అద్భుతంగా ఉందన్నారు.
salman khan film sikandar
ఇక మరోనెటిజన్ మాత్రం సికందర్ పెద్దగా ఏం అనిపించలేదన్నారు. బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మురుగదాస్ డిస్సపాయింట్ చేశాడు, కథ విషయంలో కాని, స్క్రీన్ ప్లే కాని, క్యారెక్టరైజేషన్ కాని. అన్నీ చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ అనిచెప్పాలి. సినిమా అద్భుతం అని చెప్పలేము. ఒక్క సారి చూడవచ్చు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
salman khan film sikandar
చాలా కాలం తరువాత సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిల్ సినిమా అంటూ.. మరోనెటిజన్ ట్వీట్ చేశారు. ఇది బిగ్గెస్ట్ కమ్ బాక్, సల్మాన్ ఖాన్ పెర్పామెన్స్ , స్కిప్ట్ అద్భుతంగా ఉంది, రష్మిక, కాజల్ అదరగొట్టారంటూ.. ఓ నెటిజన్ తన సంతోషాన్నా వ్యక్తం చేశారు.
సికందర్ సూపర్ హిట్ సినిమా, మాస్ సినిమా, యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. దానికి తగ్గట్టు బీజీయం కూడా అద్భుతంగా సెట్ అయ్యింది. ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. అందరు అద్భుతంగా నటించారు. అంటూ మరోకరు ట్వీట్ చేశారు. మరికొందరు మాత్రం చాలా బోర్ కొట్టించారు. సినిమాలో ఏం లేదు. హీరో ఇంట్రడక్షన్ కూడా చిరాగ్గా అనిపించింది అంటున్నారు. ఇక ఇలా ఉగాది పచ్చడిలా రకరకాల రివ్యూలతో సికందర్ సినిమాపై తమ అభిప్రాయం వెల్లడించారు నెటిజన్లు. మరి ఫైనల్ గా ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.