Sai Pallavi: సాయి పల్లవి నేషనల్ అవార్డు కల నెరవేరుతుందా? అమ్మమ్మ పట్టు చీర సెంటిమెంట్‌

Published : Feb 18, 2025, 09:29 PM IST

నేషనల్ అవార్డు తీసుకునేటప్పుడు తన అమ్మమ్మ ఇచ్చిన పట్టుచీర కట్టుకుంటానని సాయి పల్లవి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
15
Sai Pallavi:  సాయి పల్లవి నేషనల్ అవార్డు కల నెరవేరుతుందా? అమ్మమ్మ పట్టు చీర సెంటిమెంట్‌
సాయి పల్లవి

'అమరన్' సినిమా సూపర్ హిట్ తర్వాత సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్'. నాగ చైతన్యతో జంటగా ఈ సినిమాలో నటించింది. మత్స్యకారుల కథతో రూపొందిన ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉంది. అదే ఈ మూవీకి హైలైట్‌గా నిలచింది. ఆ లవ్‌ స్టోరీ ఆడియెన్స్ హృదయాలని బరువెక్కించింది. 

25
`తండేల్‌` వసూళ్లు

ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన `తండేల్` ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయినా పాన్ ఇండియా సినిమాకి ఈ వసూళ్లు చాలా తక్కువ అని నిర్మాతలు అంటున్నారు. కానీ నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. ఆయనకు చాలా కాలం తర్వాత సరైన హిట్‌ పడింది. 

 

35
`అమరన్, తండేల్ ` సినిమాల విజయం:

`తండేల్` కి ముందు శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన` అమరన్` సినిమా రూ.335 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు సాయి పల్లవి 'ఏక్ దిన్', 'రామాయణం పార్ట్ 1' హిందీ సినిమాల్లో నటిస్తోంది. వరుస హిట్లతో సాయి పల్లవి తన పారితోషికం కూడా పెంచేసుకుందట.

45
అమ్మమ్మ ఇచ్చిన పట్టుచీర:

నేషనల్ అవార్డు తీసుకోవాలనేది తన కల అని సాయి పల్లవి చెప్పింది. 21 ఏళ్ల వయసులో తన అమ్మమ్మ పెళ్లి కోసం పట్టుచీర ఇచ్చిందని, నేషనల్ అవార్డు వంటి పెద్ద అవార్డు వచ్చినప్పుడు ఆ చీర కట్టుకుని అవార్డు తీసుకుంటానని చెప్పింది.

 

55
సాయి పల్లవి నేషనల్ అవార్డు కల:

2022లో వచ్చిన 'గార్గి' సినిమాకి సాయి పల్లవికి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నారు. కానీ నిత్యామీనన్ కి 'తిరుచిత్రంబలం' సినిమాకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ ఏడాది సాయి పల్లవి కల నెరవేరుతుందేమో చూడాలి. `అమరన్‌` సినిమాకి ఆశించే అవకాశం ఉంది. 

read  more: మహాకుంభమేళలో అకీరా నందన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌, మళ్లీ ఊపందుకున్న ఆ రూమర్లు.. కటౌట్‌ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్

also read: ఉదయ్‌ కిరణ్‌ మిస్‌ చేసుకున్న ప్రభాస్‌ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? చేసి ఉంటే ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories