
Pawan Kalyan_akira Nandan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతోపాటు ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. మంగళవారం ఆయన భార్య లెజినోవా కొణిదెల, కుమారుడు అకీరా నందన్‌లతో కలిసి ఆయన గంగానదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరితోపాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ పుణ్యస్నానం ఆచరించడం విశేషం.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ ఫిట్‌నెస్ కోల్పోయిన కాస్త లావుగా కనిపించారు. ఆయన డిప్యూటీ సీఎం అయినప్పట్నుంచి వ్యాయామాలకు సమయం కుదరడం లేదని తాజాగా ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో తన భార్య లెజినోవాతో ఆ మధ్య అనేక రూమర్లు వచ్చిన నేపథ్యంలో మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.
అయితే పవన్‌కళ్యాణ్, తన భార్య లెజినోవా, అకీరా నందన్‌లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూతురు ఆద్యగానీ, మూడో భార్య కొడుకు, కూతురు కానీ ఇందులో పాల్గొనలేదు. వారిని దూరంగా ఉంచడం గమనార్హం. వాళ్లతోనూ కలిసి వచ్చి ఉంటే నిజంగానే పవన్ ఫ్యామిలీ హైలైట్‌గా నిలిచేది. అయినా ఇప్పుడు అకీరా నందన్ ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
ఎన్నికల్లో గెలిచినప్పట్నుంచి పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్‌ని తన వెంట తిప్పుతున్నారు. జనాలకు, అటు రాజకీయ నాయకులకు పరిచయం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సరికొత్త రూమర్లకి తావిస్తుంది. అకీరా నందన్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నారనే రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
మరో రెండేళ్లలో ఆయన హీరోగా ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెంటనిర్మాతలు క్యూ కడుతున్నారట. అకీరాని తమ బ్యానర్‌లో లాంఛ్ చేయాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసమే ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య ఆయన్ని ప్రధాన కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. సరికొత్త చర్చకు తెరలేపుతున్నారు.
అయితే ఇప్పుడు నూనుగు మీసాలతో, గెడ్డంతో హీరో లుక్‌లో కనిపిస్తున్నాడు అకీరా నందన్. హైలైట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని దాటేశాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాస్, రానా వంటి స్టార్స్ ని కూడా దాటేశాడు అకీరా నందన్. హైట్‌లో ఇప్పుడు టాలీవుడ్‌లో మరే హీరో ఆ స్థాయిలో లేరని, అకీరానే ఎక్కువ హైట్ ఉంటాడని తెలుస్తుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నట్టుగా ప్రస్తుతం అకీరా నందన్ కటౌట్ ఉండటం విశేషం. ఇక హీరోగా ఎంట్రీ ఇస్తే ఆ క్రేజీ్ , రచ్చ వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు`, `ఓజీ` చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే `ఓజీ`లో అకీరా నందన్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇది నిజం కాదని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే థియేటర్లు పగిలిపోవడమే, అకీరాకి బెస్ట్ ఎంట్రీ కూడా అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం జరుగుతుందో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో `హరిహర వీరమల్లు` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులే పెండింగ్ ఉందట. పవన్ వారం రోజులు డేట్స్ కేటాయిస్తే షూటింగ్ అయిపోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఏప్రిల్, మే వరకు వాయిదా పడే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు త్వరలోనే `ఓజీ` అప్ డేట్ కూడా రాబోతుందట.