2023 లో టాలీవుడ్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన హీరోయిన్లు వీళ్లే..

Published : Dec 14, 2023, 01:34 PM ISTUpdated : Dec 14, 2023, 01:35 PM IST

2023 అయిపోయింది. మరికొన్నిరోజుల్లో 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది అన్ని రంగాలతో పాటు.. సినిమా రంగంలో కూడా తీపి,చేదు కలయికతో సాగింది. ఇక ఈ ఏడాది అసలు వెండితెరపై కనిపించకుండా ఆడియన్స్ ను డిస్సపాయింట్ చేసిన హీరోయిన్లు ఎవరు..?   

PREV
18
2023 లో టాలీవుడ్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన  హీరోయిన్లు వీళ్లే..

హీరోలతో పాటు..హీరోయిన్ల కు కూడా డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వారి సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే వారు అభిమానించే హీరోయిన్లు ఏడాది పాటు కనిపంచకపోతే..ఫ్యాన్స్ కు ఎలా ఉంటుంది..? ఈ ఏడాది అదే జరిగింది. స్టార్ హీరోయిన్లు చాలా మంది 2023 లో కనిపించలేదు. కొంత మంది  షూటింగ్ కే పరిమితం అయితే.. మరికొంత మంది ఈ ఏడాది కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నారు. 

28

ఈ ఏడాది అసలు వెండితెరపై కనిపించని హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవల్సింది సాయి ప‌ల్ల‌వి గురించి. గత ఏడాది రానాతో కలిసి నటించిన వీరాటపర్వం , గార్గి సినిమాతో సందడి చేసిన సాయి పల్లవి.. ఆతరువాత కంప్లీట్ గా మాయం అయ్యింది. తెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ ఏడాది అంతా కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంది బ్యూటీ. ఇక సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న సాయి పల్లవి.. తాజాగా తెలుగు సినిమాకుసైన్ చేసింది. నాగచైతన్య తండేల్ మూవీలో నటించబోతుంది. ఇక ఈమూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈ లెక్కన ఆమె 2024 లో యాక్టీవ్ అవ్వబోతోంది. 
 

38

ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గ‌త నాలుగైదేళ్లుగా హిట్ సినిమా లేకు ఇబ్బంది పడుతుంది. చేసిన ప్రతీ సినిమా ఆమెకు నిరాశ మిగిల్చింది. రాధేశ్యామ్,బీస్ట్, ఆచార్య, లాంటిడిజాస్టర్స్ అందుకుంది పూజా. ఆతరువాత టాలీవుడ్  తెరపై ఆమె కనిపించలేదు. మహేష్ బాబుతో గుంటూరు కారంలో నటిస్తూ..మధ్యలోనే ఆమె వెనక్కి తగ్గింది. దాంతో ఈ ఏడాది పూజా హెగ్డే నుంచి టాలీవుడ్ లో  ఏ సినిమా థియేటర్లలో కనిపించలేదు. 2023 అంతా పూజాకు అస్సలు కలిసి రాలేదనాలి. ఇక బాలీవుడ్ లో మాత్రం సల్మాన్ ఖాన్ జోడీగా నటించిన కిసికా జాన్ మూవీ పర్వాలేదు అనిపించింది. 

48
photo credit Rakul instagram

ఇక 2023 లో కనిపించని మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈబ్యూటీకి తెలుగు నాట అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. హిందీ తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఒక రకంగా చూస్తే.. లాస్ట్ ఇయర్ కూడా రకుల్ నుంచి తెలుగు సినిమాలేవి రాలేదు. 2021 లో వచ్చిన కొండపొలం తరువాత రకుల్ ప్రీత్ తెలుగు ఇండస్ట్రీకి హ్యాండ్ ఇచ్చి..హిందీ, తమిళ్ సినిమాలు చేసుకుంటుంది. 
 

58

ఇక తాజాగా మెగా వారింటి కోడలుగా వెళ్లింది లావణ్య త్రిపాటి.. ఈ  స్టార్ బ్యూటీ నుంచి కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాలేదు.  లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్ డే, అంతకు ముందు చావు కబురు చల్లగా సినిమాలు చేసిన లావణ్య.. ఈ ఏడాది మాత్రం కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంది. ఎలాగో పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టి.. ఏ టెన్షన్స్ లేకుండా..హ్యాపీగా గ్లామర్ పెంచుకునే పని పెట్టుకుంది బ్యూటీ. నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఘనంగా పెళ్ళాడింది లావణ్య. 
 

68

2023లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ను  కూడా టాలీవుడ్ ఆడియన్స్ బాగా మిస్ అయ్యారు. ఆమె సినిమాలు ఏవి ఈ ఏడాది రిలీజ్ కాలేదు.  అలా అని అనుపమా రెస్ట్ లో లేదు.. నెక్ట్స్ ఇయర్ తన అభిమానులకు అద్భుతమూన విందు రెడీ చేస్తోంది.  ప్ర‌స్తుతం తెలుగులో టిల్లు స్వ్కేర్‌తో పాటు ర‌వితేజ ఈగిల్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.ఈగిల్ సంక్రాంతికి రిలీజ్ అవుతోండ‌గా టిల్లు స్వ్కేర్ ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 
 

78
Mehreen Pirzada

ఇక పెళ్ళి కూడా వద్దు అనుకుని కెరీర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చిన మెహరిన్ కూడా  ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్ కే కాదు.. అసలు వెండితెరకే హ్యాండ్ ఇచ్చింది. ఎఫ్3 ఫెయిల్ అయిన తరువాత ఆమెకు ఆఫర్లు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆమెకన్నడ సినిమా షూటింగ్ లో ఉంది. కాని తెలుగులో మాత్రం ఇంత వరకూ ఏ సినిమాకు సైన్ చేయలేదు. 
 

88

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ.. సదడి చేసిన రాశీఖ‌న్నా.. వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసింది. ఆమెకు టాలీవుడ్ కలిసిరాలేదు.. 2023లో ఆమె  తెలుగు ప్రేక్ష‌కుల‌కు హ్యాండిచ్చింది. థాంక్యూ త‌ర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న రాశీఖ‌న్నా బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోంది. ఇలా టాలీవుడ్ తెరపై చాలా మంది హీరోయిన్లు  కనిపంచలేదు ఈ ఏడాది. మరి నెక్ట్స్ ఇయర్ అయినా సందడి చేస్తారో లేదో చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories