శ్రీలంకలో జన్మించిన కేరళ నటి, దివంగత సుజాత (Sujatha) తమిళ చిత్రాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ, మలయాళం, హిందీలో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. తెలుగులోనూ ‘గోరింటాకు’, తదితర చిత్రాలతో అలరించింది. అయితే సుజాత చిరుకు మొట్టమొదట చెల్లెలు పాత్రలో నటించిన హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు. 1982లో వచ్చిన ‘సీతాదేవి’ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించారు. అయితే అంతకు ముందు 1980లో కృష్ణం రాజు, చిరంజీవి మల్టీస్టారర్ గా వచ్చిన ‘ప్రేమ తరంగాలు’ చిత్రంలో చిరుకు హీరోయిన్ గా నటించడం విశేషం. ఆ తర్వాత ‘బిగ్ బాస్’లో తల్లిగానూ నటించి ఆశ్చర్యపరిచారు. ఈమె 2011 ఏప్రిల్ లో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 300కుపైగా సినిమాల్లో నటించింది.