ఏఎన్నార్ కి తన భార్య అంటే ఎందుకు అంత ప్రాణమో తెలుసా..హీరోయిన్లతో చనువుగా ఉంటున్నారు అని రూమర్స్ వస్తే..  

First Published | Nov 7, 2024, 10:06 AM IST

లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు 1949లో తన బంధువుల అమ్మాయి అన్నపూర్ణని వివాహం చేసుకున్నాను. కడవరకు వీరిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శంగా సాగింది.

లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు 1949లో తన బంధువుల అమ్మాయి అన్నపూర్ణని వివాహం చేసుకున్నాను. కడవరకు వీరిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శంగా సాగింది. వీరికి ఐదుగురు పిల్లలు సంతానం. నాగార్జున, వెంకట్ కుమారులు కాగా.. సరోజ, నాగ సుశీల, సత్యవతి కుమార్తెలు. 

ఏఎన్నార్ ఒక ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేను మా బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. పెల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, పద్దతిగా పెంచారు. ఏమి తెలియని అమ్మాయి. కొన్ని విషయాలు నేను నేర్పించాను. మరికొన్ని తాను తెలుసుకుంది. ఆమెది పెద్ద మనసు.. సాయం కోసం ఎవరైనా అడిగితే గుప్పెడు ఇవ్వమంటే చాటంత ఇచ్చేసే రకం. మా మావగారు చెబుతూనే ఉన్నారు.. మీరిద్దరూ అలాగే ఉంటే మీకు ఏమి మిగలదు అని హెచ్చరించారు. 


కాబట్టి డబ్బు విషయంలో నేను స్ట్రిక్ట్ గా ఉండేవాడిని. అన్నపూర్ణకి చాలా సహనం ఉంది. అది గొప్ప లక్షణం. ఇంకొక విషయం ఏంటంటే.. నేను హీరోని కాబట్టి నా గురించి రూమర్స్ వచ్చేవి. దీనికి తోడు నేనంటే పడని వాళ్ళు ఆమెకి నా గురించి లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్ళు. మీ ఆయన ఆ హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నాడట నీకు తెలియదా అని చెప్పేవాళ్ళు. 

అలా నా గురించి చాడీలు చెప్పే వాళ్ళకి ఆమె సరిగ్గా సమాధానం ఇచ్చేది. అందుకే కదండీ మా ఆయన రొమాంటిక్ హీరో అయ్యారు.. ఇందిలో సీక్రెట్ ఏముంది అని చెప్పి పెంపించి వేసేది. ఎలాంటి రూమర్స్ ని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు అని ఏఎన్నార్ అన్నారు. కొత్త హీరోయిన్లు నాతో నటించడానికి భయపడుతుంటే.. నిర్మాతలు నన్ను అడిగేవారు.. ఏవయ్య నాగేశ్వరా రావు..ఆ అమ్మాయి భయపడుతోంది. ఇలాగైతే మీరిద్దరూ ఎలా కలసి నటిస్తారు. 

ఆమె భయం పోగొట్టేలా చనువు చేసుకో.. కబుర్లు చెప్పు అని అడిగేవారు. అందువల్ల నేను కొందరు హీరోయిన్లకు కబుర్లు చెబుతూ సరదాగా ఉండేవాడిని. ఆ తర్వాత హీరోయిన్లు కూడా ఏఎన్నార్ తో చనువుగా ఉండొచ్చు.. మాట్లాడవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వృత్తిలో భాగంగా హీరోయిన్లతో అలా ఉండాల్సి వచ్చేది అని ఏఎన్నార్ అన్నారు. 

Latest Videos

click me!