సాయి పల్లవి అనారోగ్య కారణాల వల్ల 'తండేల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయారు. చిత్ర ప్రమోషన్స్ కారణంగా ఆమెకు జ్వరం, జలుబు వచ్చింది, దీంతో వైద్యులు ఆమెకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం చిత్రం ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో టీమ్ మొత్తం ప్రమోషన్స్ కు హాజరు అవుతోంది.
జనవరి 31 న, చిత్ర టీమ్ ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది, ఇందులో అమీర్ ఖాన్ కూడా స్పెషల్ గా కనిపించారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సాయి పల్లవి వెళ్లలేకపోయింది. దాంతో సాయి పల్లవి కనపడకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో దర్శకుడు చందు మొండేటి వివరణ ఇచ్చారు.
23
Sai Pallavi starrer Thandel film update out
తండేల్ చిత్రం విస్తృతమైన ప్రచార కార్యక్రమాల కారణంగా సాయి పల్లవికి జ్వరం వచ్చిందని తెలియ చేసారు. సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె 'తండేల్' సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని... దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు. కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారని తెలిపారు. ఈ కారణం వల్లే ముంబైలో జరిగిన 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయిపల్లవి పాల్గొనలేకపోయారని చెప్పారు.
33
Sai Pallavi starrer Thandel film update out
'తండేల్' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు... అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.