లో దుస్తులు కనిపించేలా కూర్చో, అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారు.. సంచలన విషయం బయటపెట్టిన ప్రియాంక చోప్రా

Published : Feb 01, 2025, 05:06 PM IST

Priyanka chopra about casting couch: ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్‌ బాబుతో రాజమౌళి తెరకెక్కించే `ఎస్‌ఎస్‌ఎంబీ29`లో నటిస్తుంది.ఈ క్రమంలో ఆమె క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
14
లో దుస్తులు కనిపించేలా కూర్చో, అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారు.. సంచలన విషయం బయటపెట్టిన ప్రియాంక చోప్రా

Priyanka chopra about casting couch: గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్‌ సినిమా చేస్తుంది. అంతేకాదు మొదటిసారి తెలుగు సినిమా చేస్తుంది. ఆమె మహేష్‌ బాబు తో రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ కీలక పాత్ర కోసం ఆమెని ఎంపిక చేశారట. ఇటీవలే రాజమౌళిని కలిసింది ప్రియాంక చోప్రా. ఆమె లుక్‌ టెస్ట్ కంప్లీట్‌ అయ్యిందని, పాత్రకి సంబంధించిన చర్చల జరిగాయని సమాచారం. 
 

24

దీంతో ప్రియాంక చోప్రా ఇండియన్‌ సినిమాకి సంబంధించిన పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె చుట్టూ అనేక చర్చలు జరుగుతున్నాయి. చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆ మధ్య ఆమె ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో  మాట్లాడుతూ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోగా వెలిగిన ప్రియాంక చోప్రాకి ప్రారంభంలో చేదు అనుభవం ఎదురయ్యిందట. 
 

34

ప్రియాంక చోప్రా చెబుతూ, అప్పుడు తన ఏజ్‌ 19. ఓ సినిమాకి సంబంధించిన చర్చించడానికి దర్శకుడి వద్దకు వెళ్లింది. ఆయన ప్రియాంక చోప్రా ప్యాంటీ బయటకు కనిపించాలని, లోదుస్తులు కనిపించేలా కూర్చోవాలని అన్నాడట. అలా చేస్తే ఆడియెన్స్ చూస్తారని తెలిపాడట. ఆ సీన్‌లో అలా చూపించాలని అడిగాడట. తన స్టయిలీస్ట్ తో మాట్లాడతావా?

అంటే అసిస్టెంట్‌ని పిలిచి `వినండి ప్రియాంక చోప్రా మీ ప్యాంటీని చూపిస్తే ఈ సినిమాలో నిన్ను చూడటానికి చాలా మంది ఆడియెన్స్ వస్తారు. ఆ ప్యాంటీ చాలా పొట్టిగా ఉండాలి. ప్యాంటీ చూడాలి. ఆయన ఆ మాటని రెండు సార్లు కాదు నాలుగు సార్లు రిపీట్‌ చేశాడని ఎమోషనల్‌ అయ్యారు ప్రియాంక చోప్రా. 
 

44

ఇంటికి వెళ్లాక ఆ విషయాన్ని అమ్మ మధు చోప్రాతో చెప్పిందట. అంతేకాదు ఆ మూవీ నుంచి తప్పుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఆ దర్శకుడితో ఎప్పుడూ పనిచేయనని నిర్ణయించుకుందట. ఎప్పుడూ పనిచేయలేదట. గతంలో ప్రియాంక చోప్రా చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ బాబుతో రాజమౌళి మూవీ `ఎస్‌ఎస్‌ఎంబీ 29`లో నటిస్తున్న వేళ ఆమె కామెంట్స్ వైరల్‌గా మారడం గమనార్హం.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories