నా తమ్ముడి మూవీకే ఒప్పుకోలేదు, నీకెందుకు చేస్తాను..క్రేజీ హీరోకి షాకిచ్చిన చిరు, బతిమాలి ఒప్పిస్తే.. 

First Published | Sep 8, 2024, 9:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి సినిమా ఎవరు తీసినా వారిని అభినందిస్తున్నారు. కుర్రాళ్ళని ప్రోత్సహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి సినిమా ఎవరు తీసినా వారిని అభినందిస్తున్నారు. కుర్రాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒకప్పుడు చిరంజీవి ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి తన ప్రోత్సాహం అందించే వారు కాదట. 

చిరంజీవితో సన్నిహితంగా ఉండే నటుల్లో సీనియర్ యాక్టర్ సాయి కుమార్ ఒకరు. చిరుని సాయి కుమార్ ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తుంటారు. సాయి కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే పోలీస్ స్టోరీ అని చెప్పొచ్చు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ చిరంజీవితో జరిగిన ఆసక్తికర సంఘటనని అభిమానులతో పంచుకున్నారు. 


పోలీస్ స్టోరీని తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు పబ్లిసిటీ కావాలి. రిలీజ్ కి ముందు సినిమా ప్రముఖులకు స్పెషల్ షో అరేంజ్ చేశాం. రామానాయుడు, ఎస్ వి కృష్ణారెడ్ట్ లాంటి ప్రముఖులని ఆహ్వానించాం. కానీ ఇంకా పెద్ద హీరో ఎవరైనా సినిమా చూస్తే బావుంటుంది అని అనుకున్నాం. చిరంజీవి అన్నయ్యని పిలిస్తే ఎలా ఉంటుంది అని అనిపించి ఆయన ఇంటికి వెళ్లాం. ఈ విధంగా పోలీస్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతోంది అన్నయ్య.. మీరు సినిమా చూసి వీడియో బైట్ ఇస్తే బావుంటుంది అని రిక్వస్ట్ చేశా. 

నన్ను ఇబ్బంది పెట్టకు సాయి చాలా బిజీగా ఉన్నా. అలాంటివి నేను చేయను. నేను వీడియో బైట్ ఇస్తే నా ఫ్యాన్స్ నమ్మి సినిమా చూస్తారు. ఒక వేళ వాళ్ళకి నచ్చకపోతే.. అందుకే వద్దు అని అన్నారు. నా తమ్ముడు కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రానికి కూడా వీడీయో బైట్ అడిగారు. కానీ నేనే వద్దు అని చెప్పా. సినిమా జనాల్లో నుంచే రావాలి అని చిరు తెలిపారు. 

దీనితో సాయి కుమార్.. సరే అన్నయ్య.. మీరు సినిమా చూడండి.. నచ్చితేనే వీడియో ఇవ్వండి అని చెప్పారట. ఇరకాటంలో పెట్టేశావు కదరా.. సరే అలాగేలే అని అన్నారట. ఒక వైపు సెలెబ్రెటీలకు 6 గంటలకు షో మొదలయింది. హైదరాబాద్ లో ఉన్నది ఒక్కటే ప్రింట్. దీనితో చిరంజీవికి మరో చోట 7 గంటలకి షో ఏర్పాటు చేశాం. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్ కి నేనే రీల్ ని బైక్ లో మార్చేవాడిని. 

షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి వచ్చారు. అలసిపోయి ఉన్నారు. సీట్లో రిలాక్స్ గా కూర్చున్నారు. ఆయన సతీమణి సురేఖ కూడా వచ్చారు. సినిమా మొదలయ్యాక రిలాక్స్ గా కూర్చున్న చిరంజీవి.. అటెన్షన్ తో పూర్తిగా ఇన్వాల్వ్ అయి మూవీ చూడడం ప్రారంభించారు. సినిమా పూర్తయింది. ఒక్కసారిగా నా భుజంపై చేయి వేసి ఎంత అద్భుతంగా చేసావురా అంటూ ప్రశంసించడం మొదలు పెట్టారు. మూవీ ఆయనకి విపరీతంగా నచ్చేసింది అని సాయి కుమార్ తెలిపారు. 

Latest Videos

click me!