హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయనే భయం కూడా లేదు..రిస్క్ అని తెలిసినా ఆ మూవీ చేసిన ఎన్టీఆర్

First Published | Sep 8, 2024, 7:42 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరుగులేని నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు. దేవర, వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభం అయింది. అయితే గతంలో ఎన్టీఆర్ చాలా ఫ్లాప్ చిత్రాలు చూశారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరుగులేని నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు. దేవర, వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభం అయింది. అయితే గతంలో ఎన్టీఆర్ చాలా ఫ్లాప్ చిత్రాలు చూశారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో చాలా డౌన్ ఫాల్ చూశారు. మళ్ళీ యమదొంగ తో పుంజుకున్నారు.

యమదొంగ తర్వాత కూడా కొన్ని ఫ్లాపులు పడ్డాయి కానీ ఎన్టీఆర్ కెరీర్ కి అంత ఇబ్బంది కాలేదు. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో రిస్క్ చేస నటించిన  మూవీని ప్రేక్షకులు భావిస్తారు. ఎందుకంటే ఈ చిత్రంలో తారక్ పాత్ర నెగిటివ్ టచ్ తో ఉంటుంది. ఈ  చిత్రానికి కథ అందించిన వక్కంతం వంశి కూడా ఇదే విషయాన్ని తెలిపారు. 

Latest Videos


టెంపర్ విషయంలో వక్కంతం వంశీ స్వయంగా ఎన్టీఆర్ నే ప్రశ్నించారు. బాద్షా తర్వాత ఎన్టీఆర్ కి రామయ్య వస్తావయ్యా, రభస రూపంలో రెండు డిజాస్టర్లు గురయ్యాయి. ఆ టైంలో ఎంచుకున్న కథ టెంపర్. తేడా కొడితే హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయి. రిస్క్ అనిపించలేదా అని వక్కంతం వంశీ అడిగారు. 

దీనికి ఎన్టీఆర్ ఎమోషనల్ గా సమాధానం ఇచ్చాడు. ఈ కథ విన్నప్పుడు నాకు గ్రే షేడ్, పాజిటివ్ షేడ్ కనిపించలేదు. ఒక మనిషి ప్రయాణం మాత్రమే కనిపించింది. మంచి వాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగానే చనిపోతాడు. చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు అనేది ఈ చిత్రం కథాంశం. నేను నమ్మేది కూడా అదే అని ఎన్టీఆర్ అన్నారు. 

నేను చనిపోతే నా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతోకొంత మంది బాధపడాలి. ఒక మనిషిగా నేను సాధించుకోగలిగేది అదే అని ఎన్టీఆర్ తెలిపారు. నేను నమ్మే సిద్ధాంతంతానికి దగ్గరగా ఉండే చిత్రం టెంపర్ అని ఎన్టీఆర్ తెలిపారు. 

click me!