హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో 'జైలర్‌' విలన్‌ వినాయకన్‌ అరెస్ట్‌

First Published | Sep 8, 2024, 7:43 AM IST

'జైలర్' చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్‌ను హైదరాబాద్  పోలీసులు అరెస్ట్‌ చేశారు
 


సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ చిత్రం జైలర్ లో విలన్ క్యారెక్టర్ పోషించిన వినాయకన్‌ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నాడు. ఈ  మళయాళ నటుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే వినాయకన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ చేయి చేసుకున్నట్టుగా ఫిర్యాదు చేయటంతో.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 


మద్యం మత్తులో కానిస్టేబుల్ మీద దాడి చేసినట్లు ఫిర్యాదు చేయటంతో.. వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ పోలీసులు.. ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. వినాయకన్ అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కవగా మళయాళ సినీ పరిశ్రమలో నిమాలు చేసిన వినాయకన్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. అతను తన బిహేవియర్ తో సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారు. 

Latest Videos


Vinayakan


హైదరాబాద్ లో వినాయకన్ ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు. ఇక కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఇక వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  

Vinayakans


కొచ్చిలో సినిమా షూటింగ్ ముగించుకుని వినాయకన్ గోవా వెళ్తున్నట్టు సమాచారం. అయితే.. హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వినాయకన్ ఎదురుచూస్తున్న సమయంలోనే.. ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. వినాయకన్‌ మాత్రం మరోలా చెప్తున్నారు. తానుం ఏ తప్పూ చేయలేదని చెప్తున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారని... కావాలంటే సీసీటీవీ ఫుటేజీ కూడా చెక్‌ చేసుకోవాలంటూ చెప్తున్నారు. అసలు తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఓ మీడియాతో వాపోతున్నారు. 
 


వినాయకన్  గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు  కేరళ పోలీసులు వినాయకన్‌ను అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో గొడవకు దిగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినాయకన్‌ తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ.. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. అపార్ట్ మెంటుకు చేరుకుని వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా వినాయకన్ మద్యం మత్తులో ఉండటం గమనార్హం. అయితే.. అరెస్ట్ సమయంలో వినాయకన్‌ కోపంతో ఊగిపోయాడు. తాము మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు.. వినాయకన్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం అదే మొదలిసారి కాదు. గతంలోనూ ఓ మోడల్‌ను వేధించాడన్న ఆరోపణలతో వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

click me!