సంచలన హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో సాయిధరమ్ తేజ్ చిత్రం.. మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్

First Published | Oct 25, 2024, 5:41 PM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ SDT 18(వర్కింగ్ టైటిల్). డెబ్యూ డైరెక్టర్ కెపి రోహిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ SDT 18(వర్కింగ్ టైటిల్). డెబ్యూ డైరెక్టర్ కెపి రోహిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండే భారీ యాక్షన్ చిత్రాలకే ఆదరణ లభిస్తోంది. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కూడా అలాంటిదే. 

తేజు కెరీర్ లోనే హైయెస్ట్ గా దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తేజు బర్త్ డే సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియో అంచనాలు పెంచేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజు మతిపోయే అంశాలు ఈ చిత్రం గురించి రివీల్ చేశారు. పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 


హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 300 చిత్రం నుంచి స్పూర్తితో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఆల్రెడీ 30 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రతి ఒక్కరు షాక్ అయ్యేలా ఈ చిత్ర విజువల్స్ ఉండబోతున్నాయి అని సాయిధరమ్ తేజ్ తెలిపారు. 

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నారు. మేకింగ్ వీడియోలో కూడా భారీగా కండలు పెంచి సర్ప్రైజ్ చేశాడు. హను మాన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

Latest Videos

click me!