రహస్యంగా పెళ్లి చేసుకున్న `సాహో` బ్యూటీ ఎవిలిన్‌ శర్మ.. ఫ్యాన్స్ కి భలే షాక్‌!

Published : Jun 07, 2021, 02:02 PM IST

`సాహో` బ్యూటీ ఎవలిన్‌ శర్మ సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుని తన అభిమానులకు పెద్ద షాక్‌ ఇచ్చింది. మ్యారేజ్‌ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించి అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ఆయా ఫోటోలు పంచుకుని సర్‌ప్రైజ్‌ చేసింది ఎవిలిన్‌. 

PREV
16
రహస్యంగా పెళ్లి చేసుకున్న `సాహో` బ్యూటీ ఎవిలిన్‌ శర్మ.. ఫ్యాన్స్ కి భలే షాక్‌!
ఎవిలిన్‌..ఆస్ట్రేలియాకి చెందిన తుషార్‌ బిందిని ఆమె వివాహం చేసుకుంది. గత నెలలోనే అతి కొద్దిమందితో, చాలా రహస్యంగా వీరి మ్యారేజ్‌ వేడుక జరిగినట్టు తెలిపింది. గత నెలలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లితంతును పూర్తి చేశారు.

26
ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, `బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్ళి చేసుకోవడం కంటే మంచి విషయం ఏముంటుంది. వైవాహిక జీవితంలో అడుగుపెట్టినందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది. మ్యారేజ్‌ విషయంలో సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు` అని తెలిపింది.

36
2018లో ఫ్రెండ్స్ పార్టీలో తుషార్‌ని కలుసుకుందట. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లిగా మారింది. 2019లో తుషార్‌ ఆమెకి ప్రపోజ్‌ చేశాడు. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్‌ చేయడంతో ఎవలిన్‌ మరో మాట లేకుండా ఓకే చెప్పింది. దీంతో గతేడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది.

46
ప్రస్తుతం భర్తతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకి విషెస్‌ తెలియజేస్తున్నారు.

56
ఎవలిన్‌ శర్మ బాలీవుడ్‌లో `ఏ జవానీ హై దీవాని`, `యారియన్‌` సహా పలు చిత్రాల్లో నటించింది. 'ఏ దిజవానీ హై దీవాని' చిత్రం రిలీజై ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి అయింది.

66
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌ నటించిన `సాహో` చిత్రంలో జెన్నీఫర్‌గా కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories