నేను పాడిన పాటకి చిరంజీవి ప్రాణప్రతిష్ఠ..ఎస్పీ బాలు దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే, ఇప్పటి హీరోల్లో

First Published | Oct 12, 2024, 10:32 AM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో చిరంజీవి డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు తన దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరో చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు. డ్యాన్స్ అంటేనే మెగాస్టార్ కి ఒక పూనకం వచ్చేస్తుంది. చిరంజీవి డ్యాన్సులని అంత ఇష్టపడి చేస్తారు. ఇటీవల చిరు తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు. సినిమాల్లో ఏకంగా 24 వేల స్టెప్పులు వేసి అరుదైన రికార్డ్ సృష్టించారు. చిరంజీవి డ్యాన్సులని గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటారు. 

కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో చిరంజీవి డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పాటు తన దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరో చెప్పారు. పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీ బాలు చాలా కలం జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఒక పిల్లాడు చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలోని 'టపు టపు టపోరి కన్యాకుమారి' అనే పాట పాడాడు. ఆ కుర్రాడిని బాలు ప్రశంసిస్తూ చిరంజీవి డ్యాన్సుల గురించి ప్రస్తావించాడు. 


బాలు మాట్లాడుతూ.. అది మంచి హుషారైన పాత. అందులో యాక్ట్ చేసింది ఎవరో తెలుసా అని బాలు.. పిల్లాడిని అడిగారు.. దీనితో అతడు చిరంజీవి, విజయశాంతి అని  సమాధానం ఇచ్చాడు. నేను మీ అందరికీ చెబుతున్నాను.. చిరంజీవి ది బెస్ట్ డ్యాన్సర్ అంటూ బాలు ప్రశంసలు కురిపించారు. చాలా మంది గొప్పగా డ్యాన్స్ చేస్తారు కాదనను. కానీ ఆ గ్రేస్ తో చిరంజీవి డ్యాన్స్ చేసినట్లు ఇంకెవరూ చేయలేరు. చిరంజీవిలో ఒక గ్రేస్ ఉంది. అలా గ్రేస్ తో డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. 

చిరంజీవితో పాటు ప్రభుదేవా, కమల్ హాసన్ ఒక గ్రేస్ తో డ్యాన్స్ చేస్తారు. నటీమణుల్లో అయితే భానుప్రియ, అప్పట్లో ఎల్ విజయలక్ష్మీ, వైజయంతి మాల వీళ్లంతా గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా బాగా డ్యాన్స్ చేస్తారు కానీ గ్రేస్ ఉండదు. నేను పాడిన పాటకి చిరంజీవి డ్యాన్స్ చేస్తే.. ఆ పాటకి ప్రాణ ప్రతిష్ట జరిగినట్లు ఉంటుంది. చిరంజీవి డ్యాన్స్ తో మా పాటని చూసినప్పుడు ఆ సంతోషం అంతా ఇంతా కాదు. 

Prabhudeva

కొంతమంది డ్యాన్స్ చేస్తారు.. మేము కష్టపడి పాడితే స్క్రీన్ మీద ఏమి ఉండదు. మాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ చిరంజీవి అలా కాదు. ప్రతి పాటని చిరు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు. అయితే బాలసుబ్రహ్మణ్యం ఇప్పటి హీరోల డ్యాన్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. 

Latest Videos

click me!