కొడుకుని అడ్డం పడొద్దని చిరు స్మూత్ గా చెప్పి,దూకుడుగా ముందుకు?

First Published | Oct 12, 2024, 9:09 AM IST

అనుకోని కారణాలవల్ల షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ ని చేంజ్ చేసుకుని సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే వార్తలు మొదలయ్యాయి.

Chiranjeevi, Viswambhara, Sankranthi


టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు కొత్త డిస్కషన్ మొదలైంది. చిరంజీవి తాజా చిత్రం 'విశ్వంభర' సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అని. ఎందుకంటే ఓ ప్రక్కన సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాదంటూ వార్తలు వస్తున్నాయి. మరికొన్ని మీడియాల్లో అదేం లేదు..సంక్రాంతికే వచ్చేస్తోంది ఈ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఏది నిజం..ఏది అబద్దం అనేది క్లారిటీ రావటం లేదు. అసలు ఈ కన్ఫూజన్ ఎందుకు మొదలైంది..ఏమిటి దీని వెనక విషయం అనేది చూస్తే.


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగులో విశ్వంభర అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి బింబిసార సినిమా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత వంశీ కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.  

విశ్వంభర చిత్రంలో త్రిష, కునాల్ కపూర్, మీనాక్షీ చౌదరి, ఆషికా రంగనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.  ఇక ప్రముఖ  సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



ఇది ఇలా ఉండగా విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ ని చేంజ్ చేసుకుని సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే వార్తలు మొదలయ్యాయి. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అందుకు  కారణం రామ్ చరణ్ అని అంటున్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Chiranjeevi


విశ్వంభర సినిమా సంక్రాంతి బరి నుంచి వెనక్కు జ‌రుగుతోందని, దానికి కారణం ఓటీటీ స్లాట్ లేకపోవడం అన్నది వినిపిస్తోంది. కానీ అది కాదని, రామ్ చరణ్ నే స్వయంగా తన గేమ్ ఛేంజ‌ర్ సినిమా కోసం విశ్వంభర సినిమాను వెనక్కు జ‌రిపినట్లు  మీడియా అంటోంది.

గేమ్ ఛేంజ‌ర్ సినిమా  సినిమాని క్రిస్మస్ కు కాకుండా సంక్రాంతి తీసుకు వస్తే  అటు తమిళ్, ఇటు తెలుగులో పెద్ద సీజ‌న్ కలిసి వస్తుందిని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్   నిర్మాతలను విక్రమ్ రెడ్డిని విశ్వంభర వాయిదా కు ఒప్పించినట్లు చెప్తున్నారు. అందుకే విశ్వంభర వెనక్కు వెళ్లక తప్పదని చెప్తున్నారు.
 


ఈా క్రమంలో   సంక్రాంతి నుంచి వాయిదా వేయాలనే ప్రపోజల్‌ను హీరో చిరంజీవి మాత్రం ఇష్టపడటం లేదట. రామ్ చరణ్ రిక్వెస్ట్ కు నో చెప్తున్నారని అంటున్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం క్రిస్మస్ కే గేమ్ ఛేంజర్ వస్తే బెస్ట్ అని, తను సంక్రాంతికి వచ్చి వాల్తేరు వీరయ్య తరహాలో సూపర్ హిట్ కొడతాననే నమ్మతంతో ఉన్నారు. తనకు హెల్త్ ఇబ్బంది వచ్చినా రాత్రి పగలు కష్టపడి సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేయమని కోరాడట. సినిమాలకు అత్యంత కీలకంగా భావించే సంక్రాంతి సీజన్‌ను మిస్‌ కాకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.

Latest Videos

click me!