ఎన్టీఆర్ ‘దేవర2’కి కొత్త చిక్కులా? నిజమైతే టైమ్ పడుతుంది

First Published | Oct 12, 2024, 8:15 AM IST

  దేవర 2 సినిమాను 2025 అక్టోబర్ తరువాత స్టార్ట్ చేయాలన్నది ఎన్టీఅర్ అలోచనగా తెలుస్తోంది

ntr, devara2, koratala shiva


ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇటీవల విడుదలైన ఈ సినిమా హై సక్సెస్ ని  అందుకుంది. దీంతో దీని సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు, హీరో సీక్వెల్స్ గురించి చిన్న చిన్న లీక్స్ లాంటి అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే అదే సమయంలో ఈ సీక్వెల్ కు నిర్మాతల వైపు నుంచి చిక్కులు ఉన్నాయని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

ntr, devara2, koratala shiva


మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు రీసెంట్ గా స్టేజీపై  ఎన్టీఅర్  తనకు, తన బ్యానర్ కు కీలకమైన హరి గురించి ఇటీవల మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా హరి తనకు, తన బ్రదర్ కు, తమ బ్యానర్ కు కీలకం అని ఎన్టీఅర్ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పుకొచ్చారు.

అయితే ఎవరు ఏమన్నారు...ఆ అన్నది ఎవరు...ఎన్టీఆర్ కు ,కళ్యాణ్ రామ్ కు సన్నిహితుడైన హరి పై  మాట్లాడే ధైర్యం ఎవరు చేసారు అనుకున్నారు.  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హరిని అప్డేట్స్ గురించి నిలదీయటం, ప్రీ రిలీజ్ పంక్షన్ కాన్సిల్ గురించి మాట్లాడమే అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడింది ..నిర్మాతను ఉద్దేశించి అని తెలుస్తోంది.
 



మీడియాలో ,ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయం మేరకు..ప్రొడక్షన్ లో  హరి ప్రమేయం వుంటే తాను దేవర 2 సినిమా చేయడం కష్టమని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని  స్ట్రైయిట్ గానే చెప్పినట్లు సమాచారం. అయితే ఆ విషయం కళ్యాణ్ రామ్ కు ,  ఎన్టీఅర్ కు కోపం వచ్చింది.

ఎన్టీఆర్ సినిమా చెయ్యాలంటే ఖచ్చితంగా ఎన్టీఅర్ అర్ట్స్ కలవాల్సి వుంటుంది.అదే సమయంలో నిర్మాణ బాధ్యతలు కూడా అప్పగించాల్సి వుంటుంది.  ఆ క్రమంలోనే హరికి, నిర్మాత సుధాకర్ మిక్కిలినేని మధ్యన తేడాలు వచ్చాయని అంటున్నారు. అయితే ఆ విషయం నిర్మాతతో డైరక్ట్ గా చెప్పకుండా ఇలా స్టేజిపై ఎన్టీఆర్ చెప్పి ఇండైరక్ట్ గా విషయం తెలియచేసాడని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయమై తేలే దాకా దేవర 2 లేటు అవుతుందని అంటున్నారు. 


అయితే ఎన్టీఆర్ కు మాత్రం దేవర 2 సినిమాను 2025 అక్టోబర్ తరువాత స్టార్ట్ చేయాలన్నది ఎన్టీఅర్ అలోచనగా తెలుస్తోంది. కొరటాల తాను మధ్యలో నిర్మాత, హీరో మధ్యన కొన్ని విషయాల్లో వేలు పెట్టకూడదని , బిజినెస్ కూడా చూడకూడదని ఆచార్య తో తెలుసుకుని దూరంగా ఉంటున్నారు.

అయితే కళ్యాణ్ రామ్ యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ మేరకు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ని , హరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇష్యూలు సెటిల్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. అదే నిజమైతే ఏ సమస్యా ఉండదు.  అయితే ఇదంతా అఫీషియల్ సమాచారం అయితే ఏమీ కాదు.మీడియా  వర్గాల్లో వినిపిస్తున్న విషయాలు మాత్రమే. 

Ntr, Devara, koratala shiva,


ఈ సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేవర2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సీక్వెల్‌లో మరికొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ ఉండే అవకాశం ఉందన్నారు.‘‘ఇది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. ‘దేవర2’లో రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ఉంటే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇది జరుగుతుందో, లేదో తెలియకుండా నేను ఎక్కువ వివరాలు పంచుకోకూడదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల పేర్లు చెబితే ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలవుతాయి. ‘దేవర2’లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. అవి సినిమాలో చాలా కీలకమైనవి. అతి త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తాను’’ అని కొరటాల శివ (Koratala Siva) అన్నారు.
 

Junior NTRs Devara

‘దేవర 2’పై కొరటాల ఎప్పటికప్పుడు ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తున్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇటీవల వెల్లడించారు. పార్ట్‌ 1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారన్నారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుందని చెప్పారు . ఎన్టీఆర్‌ కూడా ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. మొదటి భాగం విజయం సాధించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ‘దేవర’ కంటే దాని సీక్వెల్‌ ఇంకా బాగుంటుందన్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 

Latest Videos

click me!