అకీరా నందన్‌తో `ఖుషి 2`, దర్శకుడి నుంచి ఎగ్జైటింగ్‌ అప్‌ డేట్‌, కొడుకు ఎంట్రీపై రేణు దేశాయ్‌ క్లారిటీ

First Published | Jan 5, 2025, 11:49 PM IST

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. `ఖుషి 2`తో అకీరా ఎంట్రీ ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 
 

Akira Nandan, Pawan Kalyan, renu desai

పవన్ కళ్యాణ్‌ కొడుకు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ నడుస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎక్కువగా ఆయన బయట కనిపిస్తున్నారు. చాలా వరకు పవన్ తోనే ఉంటాడు. చంద్రబాబుని కలిసిన సమయంలో, ప్రధాని మోడీని కలిసిన సమయంలో కనిపించాడు అకీరా. ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ టైమ్‌లోనూ తండ్రి పవన్‌, అన్నయ్య రామ్‌ చరణ్‌తో కనిపించారు. 

అకీరా నందన్‌ హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఆయన లుక్‌, రీసెంట్‌ పరిణామాలు చూస్తుంటే అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తాజాగా అకీరాతో `ఖుషి 2` సినిమా చేయడంపై దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య రియాక్ట్ అయ్యాడు. పవన్‌ కళ్యాణ్‌తో ఆయన `ఖుషి` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోఇప్పుడు `ఖుషి 2`కి సంబంధించిన చర్చ స్టార్ట్ అయ్యింది. 

read more: https://telugu.asianetnews.com/gallery/entertainment/chiranjeevi-revealed-he-was-removed-from-ntr-movie-arj-spmkk5


sj suriya

`గేమ్‌ ఛేంజర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఎస్‌ జే సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీనిపై ఎస్‌జే సూర్య స్పందిస్తూ, `పవన్ కళ్యాణ్ మా ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది.

`ఖుషీ` టైంలో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ గురించి చెబుతుండేవారు. కానీ నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది` అని తెలిపారు. ఆదివారం మీడియాతో ముచ్చటించారు సూర్య. గేమ్‌ ఛేంజర్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.. 

ఈ క్రమంలోనే `ఖుషి 2` సినిమా అకీరా నందన్‌తో చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ, ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్  లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు.

ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది(ఖుషి 2)  జరుగుతుందేమో చూడాలి` అనిచెప్పారు. `గేమ్‌ ఛేంజర్‌` మూవీ ఈ నెల 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌, కీయారా అద్వానీజంటగా నటించారు. ఇందులో నెగటివ్‌ రోల్‌లో ఎస్‌ జే సూర్య చేశారు. శంకర్‌ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు నిర్మించారు.

ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో రేణు దేశాయ్‌ పాల్గొంది. అకీరా నందన్‌ సినిమాలకు సంబంధించిన ఎంట్రీపై స్పందించారు. అకీరా హీరో కావాలని, సినిమాల్లోకి రావాలని తాను ఇగర్‌గా వెయిట్‌ చేస్తున్నామని తెలిపారు. అకీరా హీరో అవుతాను అమ్మా అంటే ముందుగా ఎగ్జైట్‌ అయ్యేది, ఆనంద పడేది తానే అని తెలిపింది. అలాంటిది ఉంటే తానే ముందుగా ప్రకటిస్తానని తెలిపింది రేణు దేశాయ్‌. 

read more: `కల్కి`లో కర్ణుడిని గొప్పగా చూపించడం చూసి సిగ్గుపడుతున్నా.. ప్రభాస్‌ సినిమాపై స్టార్‌ రైటర్‌ సంచలన వ్యాఖ్యలు

Latest Videos

click me!