ఒకప్పటి హీరో గోవిందాకి, అప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్‌తో ఉన్న అనుబంధం గురించి సునీత ఆహుజా ఇటీవల వివరించారు. గతంలో గోవిందాతో కలిసి ఉంటే ఆయన్ని పెళ్లి చేసుకోనేదాన్ని అని రవీనా టండన్ తనతో చెప్పిందని, కానీ అతన్ని చేసుకునే ఉంటే అసలు పెళ్లి అంటే ఏంటో అర్థమయ్యేదని తాను సరదాగా బదులిచ్చినట్టు సునీత ఆహుజా వెల్లడించారు.
గోవిందా బిజీ షూటింగ్ షెడ్యూల్స్ సమయంలో తాను ఇంటిని, పిల్లలను ఎలా నిర్వహించానో సునీత గుర్తుచేసుకున్నారు. సాధ్యమైనప్పుడల్లా అవుట్‌డోర్ షూటింగ్‌లకు ఆయనతో పాటు వెళ్లేదానిని, కానీ గోవిందా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నప్పుడు అత్తగారి సహాయంతో కూతురు టీనాను పెంచడంపై ఎక్కువగా దృష్టి పెట్టానని ఆమె చెప్పారు.