ఎన్టీఆర్‌ సినిమా నుంచి నన్ను తీసేశారు, ఐరన్‌ లెగ్‌ ముద్ర వేస్తారని కుంగిపోయా.. చిరంజీవి కామెంట్స్

First Published | Jan 5, 2025, 10:30 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా నుంచి తప్పించారట. ఆ ఘటన తనని కుంగదీసిందని చెప్పారు చిరు. 
 

మెగాస్టార్‌ చిరంజీవి సుమారు ఐదు దశాబ్దాల కెరీర్‌లో 156 సినిమాలు చేశారు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఏడు పదులకు దగ్గరలో ఉన్నా కూడా యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నారు. రెట్టింపు ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. 

read more: సొంత తమ్ముడికి షాకిచ్చిన చిరంజీవి..దెబ్బకి జయసుధ ముఖం మాడిపోయింది
 

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఐపీటీఏకి సంబంధించిన ఓ బిజినెస్‌ రిలేటెడ్‌ మోటివేషనల్‌ కార్యక్రమంలో చిరంజీవి గెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా ఎలా మిస్‌ అయ్యిందో తెలిపారు. ఎన్టీఆర్‌తో `తిరుగులేని మనిషి` సినిమాలో నటించారు చిరంజీవి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌ అయ్యింది. 

also read: చిరంజీవి, మోహన్‌బాబులకు దిమ్మతిరిగే కౌంటర్‌, తనకు తాను `లెజెండ్‌`గా ప్రకటించుకున్న బాలకృష్ణ
 


ఆ వెంటనే ఎన్టీఆర్‌తో మరో సినిమాని బుక్‌ చేశారట. ఒక దిగ్దర్శకుడు తనని బుక్‌ చేశాడట. మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా అనేసరికి చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా కోసం రెడీ అవుతున్నారు. కానీ తన పేరులేకుండా అనౌన్స్ మెంట్‌ వచ్చిందట. మరో హీరోని తీసుకున్నారట. అదేంటి అని చాలా బాధపడ్డాడట చిరంజీవి.

షూటింగ్‌ అవుతుంది, కానీ తనకు చెప్పడం లేదు. దీంతో ఆ మూవీ నిర్మాతని విషయం అడగ్గా, అసలు విషయం చెప్పారు. ఎన్టీఆర్‌తో చేసిన మూవీ ఫ్లాప్‌ కావడంతో మళ్లీ అదే కాంబినేషన్‌ అంటే నెగటివ్‌ ఇమేజ్‌ ఉంటుంది, అందుకే వేరే హీరోని తీసుకున్నామని చెప్పారట. 
 

Chiranjeevi - NTR

అరే అదే విషయం ముందుగా చెప్పొచ్చు కదా అని చిరంజీవి అడిగితే, ఎలా చెప్పాలో అర్థం కాలేదు, బాధపడతారని ఆలోచిస్తున్నామని చెప్పారట. వాళ్లు ఆ రోజు చెప్పిన మాటతో ఒక్కసారిగా కుంగిపోయాడట చిరంజీవి. చాలా లో అయిపోయాడట. తనతో సినిమా చేస్తే ఫ్లాప్‌ అవుతున్నాయనే కామెంట్‌ విస్తరిస్తుందని బాగా భయపడ్డాడట.

ఐరన్‌ లెగ్ గా ముద్రవేస్తారని ఆవేదన చెందాడట. ఆ తర్వాత తన లక్ష్యంతో తాను అనుకున్న సినిమాలు చేసి రాణించాడట. సక్సెస్‌ అయ్యాడట. అదే దర్శకుడు తనతో సినిమాలు చేయాలని ముందుకు వచ్చాడని, అలా వారికి నిత్యం టచ్‌ లో ఉన్నానని, వినయంగా వ్యవహరించానని తెలిపారు చిరంజీవి. 
 

అదే ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేసిన ఆ దర్శకుడే ఆ తర్వాత తనతో అత్యధిక మూవీస్‌ చేశాడని, ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్‌ కంటే మూడు నాలుగు సినిమాలు ఎక్కువే చేశాడని తెలిపారు. అద తన విజయంగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లాక ఒక ఫ్రీ ఏరియా ఏర్పడిందని, ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలంతా తన వద్దకు వచ్చేవారని,

తనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారని, అప్పుడు తాను సక్సెస్‌ అయ్యానని, ఎస్‌ ఇది నా సక్సెస్‌ అని ఫీలయ్యానని, అయితే దాన్ని అహంకారంగా తీసుకోలేదని, ఎప్పుడూ ఆ గర్వం ప్రదర్శించలేదని, అణకువతోనే కష్టపడుతూ, తాను చేయాలనుకున్న సినిమాలు చేస్తూ సక్సెస్‌ సాధిస్తూ వెళ్లాలనని టాప్‌ పొజీషియన్‌కి చేరుకున్నట్టు తెలిపారు.
 

అలాగని నెంబర్‌ వన్‌ నేనే అని ఎప్పుడూ అనుకోలేదని, కానీ అలాంటి సినిమాలు చేస్తూ వచ్చానని, నేనే నెంబర్‌ వన్‌ అనే విజయగర్వం ప్రదర్శించలేదని తెలిపారు. తాను డాన్సులు, ఫైట్లు, సినిమా కథల విసయంలోనూ ఎప్పటికప్పుడు విభిన్నత చూపించానని వెల్లడించారు. అందుకే అన్ని రకాల ఆడియెన్స్ కి దగ్గరయ్యానని, ఇన్నాళ్లు రాణించగలుగుతున్నానని అని చెప్పారు చిరంజీవి.

మెగాస్టార్‌ రాఘవేంద్రరావుతో అత్యధికంగా 14 సినిమాలు చేశారు. మరి ఎన్టీఆర్‌తో కలిసి చేసే సినిమా నుంచి తీసేసింది ఆయనే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో `కొండవీటి సింహం` సినిమా చేశారు రాఘవేంద్రరావు. అందులో మోహన్‌బాబు నటించారు. మరి చిరు చెప్పిన ఆ మూవీ ఇదేనా అని టాక్‌. 

reead more: ఆ టైంలోనే చిరంజీవితో మల్టీస్టారర్ కి ఒప్పుకున్న జూ.ఎన్టీఆర్..ఇద్దరు వీరుల చరిత్రతో మైండ్ బ్లోయింగ్ కథ, కానీ

Latest Videos

click me!