అప్పుడు, ఊరికే అలాగా లాలిస్తూ తిప్పుతున్నాను అని చెప్పి తిరిగి కమల పక్కన పడుకోబెట్టొస్తుంది భాగ్యమ్మ. రుక్మిణి ఇదంతా చూసి ఎంతో ఆనందపడుతుంది.ఆ తర్వాత సీన్లో రుక్మిణి పాలు పట్టుకొని హాల్లో నుంచి వెళ్తూ ఉండగా మాధవ్ అక్కడికి వచ్చి, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాడు.దానికి రుక్మిణి నీతో మాట్లాడే అవసరం నాకు లేదు అని అంటుంది.నీకు ఎందుకు ఇంత ధైర్యం అని మాధవ్ అడగగా,అందరూ దేవతల కొలిచే దేవుడమ్మ కోడలిని, ఊరందరికీ ఆఫీసర్ సారైనా ఆదిత్య భార్యని,నాకు ఈమాత్రం పొగరుండాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.