Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి నిజాలు బయటపెట్టిన రుక్మిణి వసంత్‌, అస్సలు ఊహించరు

Published : Feb 06, 2026, 10:00 PM IST

Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడు, `సప్తసాగరాలు దాటి` ఫేమ్‌ రక్షిత్ శెట్టి  గురించి హీరోయిన్‌ రుక్మిణి వసంత్  ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. సినిమా షూటింగ్‌లో అర్ధ రాత్రి 2 గంటలకు జరిగిన ఓ ఘటనను బయటపెట్టారు. 

PREV
15
`సప్త సాగరాలు దాటి` లో మెరిసిన రుక్మిణి, రక్షిత్‌ శెట్టి

`డ్రాగన్‌` హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌, రష్మిక మందన్నా మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి కలిసి `సప్తసాగరాలు దాటి` చిత్రంలో నటించారు. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీని కోట్లాది మంది ఇష్టపడ్డారు. ఈ సినిమా తర్వాత రుక్మిణికి చాలా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే `కాంతార 2`, ఇప్పుడు ఎన్టీఆర్‌తో `డ్రాగన్‌`లో అవకాశాన్ని అందుకుంది. 

25
రిచర్డ్ ఆంటోనితో బిజీగా ఉన్న రక్షిత్‌

రక్షిత్ శెట్టి ఈ మూవీకిగానూ జాతీయ చలనచిత్ర అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు గెలుచుకున్నారు. `సప్త సాగరాలు దాటి` రెండు భాగాలు విడుదలయ్యాక సైలెంట్‌గా ఉన్నారు. ఆయన 'రిచర్డ్ ఆంటోనీ' మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

35
రక్షిత్‌ దృష్టికోణమే వేరు

తాజాగా రుక్మిణి వసంత్‌.. రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. `రక్షిత్ చాలా డిఫరెంట్. తన ప్రతి సినిమాను ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు. డబ్బు, మార్కెట్ కాకుండా ఆయన చూసే దృష్టికోణమే వేరు. అందుకే అంత విజయం సాధించార`ని రుక్మిణి వసంత్ అన్నారు.

45
అర్థ రాత్రి 2 గంటలకు జరిగిన సంఘటన

ఈ క్రమంలో అర్ధ రాత్రి 2 గంటలకు జరిగిన ఓ ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. రక్షిత్ శెట్టి ఎంత కూల్‌గా ఉంటారో, పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారో ఆమె వివరించారు. షూటింగ్‌లో కాస్ట్యూమ్స్ లీక్ అవుతాయనే భయంతో ఫోటోలు ఇవ్వరు. ఇది కఠినమైన నియమం. కానీ `సప్త సాగరాలు దాటి` షూటింగ్‌లో అర్ధ రాత్రి 2 గంటలకు ఓ అభిమాని ఫోటో కోసం గొడవ చేశాడు.

55
అభిమానికి హ్యాండిల్‌ చేసిన తీరు బయటపెట్టిన రుక్మిణి

అంత బిజీలోనూ రక్షిత్ శెట్టి ఆ వ్యక్తితో అరగంట పాటు ప్రశాంతంగా మాట్లాడి పరిస్థితిని వివరించారు. అంత కూల్‌గా హ్యాండిల్ చేశారు. ఆయన నటుడే కాదు, విభిన్న వ్యక్తిత్వం కలవారు` అని ఆయనపై ప్రశంసలు కురిపించింది రుక్మిణి వసంత్‌. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న `డ్రాగన్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది రుక్మిణి. ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories