Savitri-Sridevi: సావిత్రి, శ్రీదేవి మరణానికి కారణం ఒక్కటే.. అదే తేడా కొట్టింది.. సంచలన విషయాలు బయటపెట్టిన రైటర్‌

Published : Nov 23, 2026, 01:49 PM IST

మహానటి సావిత్రి వ్యక్తిగతంగా ఇబ్బందుల కారణంగా తాగుడికి బానిసై కోమాలోకి వెళ్లి మరణించింది. అతిలోక సుందరి శ్రీదేవి విషయంలోనూ ఇదే జరిగిందంటూ సంచలన విషయాలను బయటపెట్టాడు సీనియర్‌ రైటర్‌. ఆ వివరాల్లోకి వెళితే

PREV
15
మద్యానికి బానిసై కోమాలోకి వెళ్లి చనిపోయిన సావిత్రి

సావిత్రి.. వ్యక్తిగత జీవితంలో ఓడిపోయింది. భర్త జెమినీ గణేషన్‌తో గొడవల కారణంగా ఆయనకు దూరమైంది. దీంతో తాగుడికి బానిసైంది. మరోవైపు నిర్మాతగా నష్టాలను చవిచూసింది. దర్శకురాలిగా సక్సెస్‌ కాలేదు. హీరోయిన్‌గా కెరీర్‌ డౌన్‌ అయ్యింది. ఇవన్నీటి కారణంగా ఆమె తాగుడికికి అలవాటు అయ్యింది. ఒకప్పుడు పార్టీల్లో, హుందాగా కాస్త తీసుకునే మద్యం ఆ తర్వాత వ్యసనంగా మారింది. అది సావిత్రి జీవితాన్నే నాశనం చేసింది. డిప్రెషన్‌, అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆమె కోమాలోకి వెళ్లింది. చాలా రోజులపాటు కోమాలో ఉండి కన్నుమూసింది. సావిత్రి మరణం టాలీవుడ్‌కే కాదు, యావత్‌ సినీ లోకానికి తీరని లోటు అని చెప్పొచ్చు.

25
సావిత్రిలాగానే శ్రీదేవి కూడా

అయితే సావిత్రి లాగే శ్రీదేవి విషయంలో జరిగిందట. అతిలోక సుందరిగా వెలుగొందింది శ్రీదేవి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. సీనియర్ల నుంచి రెండో తరం హీరోల వరకు అందరితోనూ కలిసి నటించింది. రొమాన్స్ చేసింది. ఎన్టీఆర్‌కి కూతురిగా చేసి ఆ తర్వాత ఆయన సరసనే చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి ఓ ఏజ్‌కి వచ్చాక వ్యక్తిగతంగా ఇబ్బంది పడిందట. తానే అందరికంటే ముందు ఉండాలని చెప్పి ఆమె చాలా కష్టపడిందని, రోజుకి మూడు షిఫ్ట్ ల్లో పనిచేసిందట. దీంతో పలు రోగాలు ఆమెని వెంటాడాయట. డయాబెటిస్‌, బీపీ, హైపర్‌ టెన్షన్‌, డిప్రెషన్‌, అభద్రతా భావం వంటివి ఆమెని వెంటాడాయట.

35
వరుసగా ప్లాస్టిక్‌ సర్జరీలు

ఇతర హీరోయిన్లు దూసుకొస్తున్న సమయంలో శ్రీదేవి నిజంగా ఇన్‌సెక్యూరిటీ ఫీలయ్యిందట. అది కాస్త తాగుడికి కారణమయ్యిందని చెప్పారు సీనియర్‌ రైటర్‌ తోటపల్లి మధు. షుగర్‌ ఎక్కువగా ఉందని, దీంతో రోజూ ఇన్సులిన్‌ తీసుకోవాల్సి వచ్చేదని, రోజూ బోనీ కపూర్‌ గుర్తు చేసేవాడని వెల్లడించారు. కొత్త హీరోయిన్లు రావడం, వాళ్లు అందంగా ఉండటంతో శ్రీదేవి భయపడిపోయిందని, తన పని అయిపోయిందేమో అనే ఆందోళన చెందేదని, అందుకే ఎప్పుడూ అందం కోసం ప్లాస్టీక్‌ సర్జరీలు చేసుకుందని తెలిపారు. ముక్కు, మూతి,లిప్స్ ఇలా ఏది తేడాగా ఉన్న వెంటనే ప్రాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని, దీంతో అనారోగ్య సమస్య కూడా వచ్చాయని తెలిపారు. ఏదీ సరిగా తీనేది కాదని, తింటే డయాబెటిస్‌ ప్రాబ్లమ్‌ అని, లావు అయిపోతానని భయపడుతుండేదని తెలిపారు.

45
మద్యానికి బానిసై కోమాలోకి శ్రీదేవి మరణం

చివరి రోజుల్లో ఆమె చాలా డిప్రెషన్‌లో ఉండేదని, దుబాయ్‌ వెళ్లినప్పుడు ఆమె మద్యం తీసుకుందని, 11 గంటలు దాటినా ఆమె డ్రింక్‌లోనే ఉంది. బోనీ కపూర్‌ ఫోన్‌ చేస్తే లిస్ట్ చేయలేదు. ఫోన్‌ సైలెంట్‌లో ఉంది. దీంతో లిఫ్ట్ చేయలేదు. తను ఒక్కతే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా షుగర్‌ లెవర్స్ పడిపోయాయి. అయినా మరో పెగ్ వేసి స్నానం చేసి కిందకు వెళ్లి ఫుడ్‌ తీసుకుందామని ప్లాన్‌ చేసిందట. ఈ లోపు బోనీ కపూర్‌ వచ్చాడట. ఆయన సర్ప్రైజ్‌ విజిట్‌, కావాలని వచ్చానని చెప్పాడట. బోనీ కపూర్‌ ఎందుకు వచ్చాడని చెప్పి మరింతగా ఆమె ఆందోళన, టెన్షన్‌ పడి, ఆ మైకంలో మరింతగా మద్యం తీసుకుందట. ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి కోమాలోకి వెళ్లిపోయిందని తెలిపారు తోటపల్లి మధు. సావిత్రి కోమాలోకి వెళ్లి చనిపోవడానికి 14 నెలలు పడితే, శ్రీదేవికి 14 నిమిషాలే పట్టిందని, అక్కడికక్కడే చనిపోయిందంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇద్దరి మరణం సేమ్‌ అని రిచ్‌ సావిత్రి శ్రీదేవి అని, పూర్‌ శ్రీదేవి సావిత్రి అని ఆయన వెల్లడించారు. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన వీడియో వైరల్‌ అవుతుంది.

55
ఇద్దరి మరణాలకు కారణం ఒక్కటే

సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన సావిత్రి కోమాలోకి వెళ్లి దాదాపు 14 నెలలు పోరాడి చివరికి 1981 డిసెంబర్‌ 26న కన్నుమూశారు. అలాగే అతిలోక సుందరిగా విశేషంగా అలరించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న కన్నుమూశారు. ఇద్దరూ మద్యం కారణంగానే కోమాలోకి వెళ్లి మరణించారని తెలుగు సినీ రైటర్‌ తోటపల్లి మరి తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories