ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభం లోనే...చిన్మయి రాధ నీ గట్టిగా హద్దుకుని, అమ్మా నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ నువ్వు వెళ్తే నేను నీతో పాటు వచ్చేస్తాను అని ఏడుస్తుంది. అప్పుడు రాధా చిన్మయితో, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని ఒట్టు తీసుకుంటుంది. అప్పుడు చిన్నయి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళను అని చెప్పమ్మా అని అంటుంది. ఆ తర్వాత రోజు జానకమ్మ లెగిసి, రాత్రంతా మెలకువగానే ఉన్నాను తెల్లవారుజామున నిద్ర పట్టేసినట్టున్నది.ఇంట్లో రాధ ఉన్నదో లేదో అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో రాధా కనిపించదు, దేవి కూడా కనిపించదు, జానకమ్మ భయపడుతుంది. అంతలో మాధవ్ గిటార్ వాయించుకుంటూ, నీకు నాకన్నా ఆదిత్య కట్టిన తాలే ఎక్కువ అన్నావు కదా!