యంగ్ బ్యూటీకి రవితేజ సరసన నటించే ఛాన్స్.. కుర్ర హీరోయిన్లను లైన్ లో పెడుతున్న మాస్ మహారాజా.!

Published : Sep 14, 2022, 12:36 PM IST

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)  వరుస చిత్రాల్లో కుర్రహీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా అప్ కమింగ్ ఫిల్మ్స్ లో మరో యంగ్ బ్యూటీ కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. 

PREV
16
యంగ్ బ్యూటీకి రవితేజ సరసన నటించే ఛాన్స్..  కుర్ర హీరోయిన్లను లైన్ లో పెడుతున్న మాస్ మహారాజా.!

మాస్ మహా రాజా రవితేజ చివరిగా ‘ఖిలాడీ’,‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో అభిమానులను, ఆడియెన్స్ ను అలరించాడు. మరోవైపు రవితేజ లైనప్ కూడా మతిపోగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. 
 

26

ఈ క్రమంలో రవితేజ కొత్త డైరెక్టర్లకు అవకాశాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గత కొద్ది రోజులుగా రవితేజ కుర్ర హీరోయిన్లనే లైన్లో పెడుతున్నారు. తన సినిమాల్లో యంగ్ హీరోయిన్లకే అవకాశాలను అందిస్తున్నారు. 

36

ఇప్పటికే ‘ఖిలాడీ’లో డింపుల్ హయాతీ, ‘రామరావు ఆన్ డ్యూటీ’లో దివ్యాన్ష కౌషిక్, ‘ధమాఖా’లో శ్రీలీలాకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవితేజ మరో యంగ్ హీరోయిన్ తోనూ రొమాన్స్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

46

తెలుగులో పలు హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
 

56

టాలీవుడ్ లో అనుపమా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో లిప్ లాక్ తో అందర్నీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ‘కార్తీకేయ 2’తో ట్రెండింగ్ లో ఉంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీని రవితేజ - కార్తీక్ చిత్రానికి హీరోయిన్ గా సంప్రదించినట్టు సమాచారం. 
 

66

ఇక రవితేజ ప్రస్తుతం ‘రావణసుర, ధమాఖ, టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ధమాఖ’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మిగితా చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రవితేజ - కార్తీక్ ఘట్టమనేని చిత్రం కూడా ప్రారంభం కానుంది.
 

click me!

Recommended Stories