ఆ తర్వాత సీన్లో రుక్మిణి మాధవ్ గురించి నిజం తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. భాగ్యమ్మ ఏమైంది అని అడగగా ఇంక ఇక్కడ మనం ఉండొద్దమ్మా దేవిని తీసుకొని వెళ్ళిపోదాము ఇప్పుడే వెళ్లి పోదాము ఇంత నాటకం జరుగుతుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో మాధవ్, నేను నీకు నిజం చెప్పాను కానీ ఈ నిజం నువ్వు ఎవరికి చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. ఒకవేళ నువ్వు బలవంతంగా నా చేత నడిపించాలని చూసినా, అందరికీ నిజం బయటపెట్టే రోజు వచ్చినప్పుడు నా కాళ్ళని నేనే నరికి తీసుకుంటాను అంతేకాని నిన్ను వదులుకోను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో భాగ్యమ్మ, రుక్మిణి ఇద్దరూ ఆ ఇల్లు నీ వెతకడానికి వెతుకుతారు.