Karthika Deepam: మీ వెనుక నేనున్నానంటూ ఆపరేషన్ కు డబ్బులు ఇచ్చిన రుద్రాణి.. 'షాక్'లో వంటలక్క!

Navya G   | Asianet News
Published : Jan 29, 2022, 09:48 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ సీరియల్  కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Karthika Deepam: మీ వెనుక నేనున్నానంటూ  ఆపరేషన్ కు డబ్బులు ఇచ్చిన రుద్రాణి.. 'షాక్'లో వంటలక్క!

కార్తీక్ (Karthik) డబ్బుల కోసం టెన్షన్ పడుతూ రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో రుద్రాణి మనుషులు కార్తీక్ కోసం రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటారు. కార్తీక్ కనిపించడంతో వెళ్లి కార్తీక్ కు ఎదురు పడతారు. రుద్రాణి (Rudrani) అక్క రమ్మంటుంది అని కార్తీక్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.
 

26

కానీ కార్తీక్ (Karthik) తన కూతురికి బాలేదని డబ్బు కోసం తిరుగుతున్నానని అంటాడు. కానీ వాళ్ళిద్దరూ కార్తీక్ మాటలు నమ్మరు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావయ్యా అంటూ కార్తీక్ ను అంటారు. కాని కార్తీక్ మాత్రం ఇదంతా నిజమే అని అంటాడు.
 

36

అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా కార్తీక్ పై అరుస్తారు. ఇక కార్తీక్ (Karthik) కు ఓపిక నశించడం తో వాళ్లను కొట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరోవైపు రుద్రాణి (Rudrani) ఆలోచనలో పడుతుంది. సారు ను ఇంకా తీసుకురాలేదు ఏంటి అని తన మనుషులకు ఫోన్ చేస్తూ ఉంటుంది.
 

46

ఇక వాళ్ళిద్దరూ అక్కడికి ఆగకుండా మళ్లీ కార్తీక్ ను వెతకడానికి వెళ్తారు. కార్తీక్ హోటల్ దగ్గరికి వెళ్లి అప్పారావు (Apparao) కోసం చూస్తాడు. కానీ అప్పారావు అక్కడ లేకపోయేసరికి బాధపడతాడు. అదే సమయంలో రుద్రాణి (Rudrani) మనుషులు మళ్లీ అక్కడికి వస్తారు. అక్కడ కూడా కార్తీక్ వాళ్లను బ్రతిమాలుతూ ఉంటాడు.
 

56

కానీ వాళ్లు ఎంతకు వినకపోయేసరికి నేరుగా రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. ఇక రుద్రాణి కి (Rudrani) తన బాధలు చెప్పుకొని వార్నింగ్ ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. వెంటనే రుద్రాణి కార్తీక్ (Karthik) ను ఆపుతుంది. పిల్లలు అంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ల కోసం ఏదైనా చేస్తాను అని..
 

66

మీ వెనుక నేను ఉన్నాను అంటూ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు సౌర్య (Sourya) అందరిని చూడాలనిపిస్తుంది అంటూ తన మాటలతో బాగా ఎమోషనల్ అవుతుంది. హిమ నాన్నమ్మ వాళ్లకు ఫోన్ చెయ్యు అంటూ పదే పదే అంటుంది. అసలు విషయం తెలుసుకున్న అప్పు దీప (Deepa) దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు.

click me!

Recommended Stories