ఎపిసోడ్ ప్రారంభంలో ఇల్లు అమ్మడం తప్పదా అని భర్తని అడుగుతుంది కనకం. తప్పదు మధ్యతరగతి వాడికి ఆలోచించుకునే అవకాశం ఉండదు. ఈ ఇల్లు బేరానికి పెట్టి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో 50,000 వడ్డీ కట్టేద్దాము అంటాడు కృష్ణమూర్తి. ఈ మాటలు విన్న అప్పు ఈ ఇల్లు అమ్మటానికి వీలు లేదు కావ్య అక్కకి ఫోన్ చేద్దాము ఏదైనా సలహా ఇస్తుంది అనుకుంటుంది కానీ తనే ప్రాబ్లమ్స్ లో ఉంది మళ్లీ ఈ ప్రాబ్లం తనకు ఎందుకు.. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది.