
తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్(Aiswarya Menon).. తెలుగులోకి చాలా రోజుల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. 2012లో వచ్చిన `లవ్ ఫెయిల్యూర్` చిత్రంలో నటించింది. సిద్ధార్థ్ హీరోగా రూపొందించిన ఈసినిమాలో అమలా పాల్ హీరోయిన్. అయితే ఇందులో చిన్న పాత్రలో ఐశ్వర్య మీనన్ నటించింది. కాకపోతే ఆమె పాత్రకి పెద్దగా గుర్తింపు దక్కలేదు.
దీనికితోడు ఈ సినిమా తెలుగు, తమిళంలో చేసిన బైలింగ్వల్. చాలా వరకు తమిళ నటులున్నారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి ఆ సమయంలో ఐశ్వర్య మీనన్‌ని ఎవరూ గుర్తించలేదు. అలా 11ఏళ్ల క్రితమే తెలుగుకి పరిచయం అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇక తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది Aiswarya Menon. అయితే ఐశ్వర్య కెరీర్ మాత్రం అనుకున్నట్టుగా సాగలేదు. ఒడిదుడుకులతో సాగుతూ వచ్చింది. ప్రారంభంలో మూడు నాలుగుసినిమాలు వెంట వెంటనే చేసింది. కానీ ఆ తర్వాత డీలా పడిపోయింది. ఏడాదికి ఒక్కటి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంది.
ఐశ్వర్య మీనన్ నటించిన తొలి చిత్రం `లవ్ ఫెయిల్యూర్` తర్వాత `ఆపిల్ పెన్నె`, `దశవల`, `నమో భూతాత్మ`, `మాన్‌సూన్ మ్యాంగోస్`, `వీర`, `తామిజ్ పడం2` `నాన్ సిరిథాల్`, `వెజమ్`, ఇటీవల `స్పై` చిత్రాలతో మెరిసింది. తమిళంతోపాటు మలయాళ చిత్రాలు చేసింది. మధ్యలో రెండు కన్నడ మూవీస్‌లోనూ మెరిసిందీ ఐశ్వర్య మీనన్.
నిఖిల్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పై(Spy) మూవీ ఇది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. చిత్ర కథని నిర్మాత కే రాజశేఖర్‌రెడ్డి అందించడం విశేషం. స్పై కథాంశంతో సాగే సినిమా ఇది అయితే దీనికి సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ అంశాన్ని జోడించారు. కాకపోతే దాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. దీనికితోడు రెండూ మ్యాచ్ కాలేదు. దీంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఇందులో నిఖిల్‌కి జోడీగా నటించింది ఐశ్వర్య మీనన్. గ్లామర్‌తో రచ్చ చేసింది. బోల్డ్ సీన్లు చేసింది. బెడ్ సీన్లలోనూ విశ్వరూపించింది. కాసేపు ఆడియెన్స్ షాక్ అయ్యేలా చేసింది. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ. ఏజెంట్ వైష్ణవిగా మారిపోయి నిఖిల్‌కి షాకిచ్చింది. ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్ చేసింది.
దీంతో `స్పై` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తనదైన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్ ట్రీట్‌లతో మరింత దగ్గరవుతుంది. తన అందాల డోస్ చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. పొట్టి పొట్టి దుస్తులతో టాలెంట్ చూపిస్తూ రెచ్చిపోతుంది, నెటిజన్లని రెచ్చగొడుతుంది.
తాజాగా ఐశ్వర్య మీనన్ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో స్లీవ్ లెస్ గౌన్ ధరించింది. వయ్యారాలు ఒలకబోస్తూ రెచ్చిపోయింది. అదే సమయంలో పరువాల జోరు చూపించింది. సైడ్ యాంగిల్‌లో ఎద ఎత్తులు చూపించింది. తన భారీ పరువాల విందుతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ఐశ్వర్య మీనన్‌లోని ఇంతటి హాట్‌నెస్‌కి కుర్రాళ్లు షాక్ అవుతుంది. ఆ అందాల దాడికి విలవిలలాడిపోతున్నారు. ఈ వేడి తట్టుకో తరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్‌గా మారుస్తున్నారు.