
ఎపిసోడ్ ప్రారంభంలో జగతి దగ్గరికి వచ్చిన మహేంద్ర నేను రిషి దగ్గరికి వెళుతున్నాను. తనని ఎలాగైనా కాపాడుకోవాలి అంటాడు మహేంద్ర. నేను కూడా వస్తాను అంటుంది జగతి. నువ్వు వస్తే రిషి నాతో కూడా ఫ్రీగా మాట్లాడలేడు అయినా నువ్వు ఎక్కడ ఉండడమే మంచిది శైలేంద్ర ఏం చేస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది అని జగతికి నచ్చచెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు మహేంద్ర.
మరోవైపు ప్రిన్సిపాల్ దగ్గర నుంచి బయటికి వచ్చిన రిషి వసుధార మెసేజ్ చూస్తాడు. వసుధారకి ఫోన్ చేసి మీరు నాకోసం వెయిట్ చేయక్కర్లేదు మీరు అనుకున్నట్లుగానే నేను మిషన్ ఎడ్యుకేషన్ టేక్ అప్ చేస్తున్నాను అని చెప్తాడు. దాని గురించి కాదు సార్ నేను మీ గురించి మాట్లాడాలి అని వసుధార ఎంత చెప్తున్నా వినిపించకూడదు. అది కాకుండా మీరు ఇంకొక విషయం ఏదైనా మాట్లాడాలి అంటే అది పర్సనల్ లైఫ్ గురించి అయి ఉంటుంది.
పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాల్సిన అంత బంధం మన మధ్య లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తను చెప్పేది రిషి వినలేదని వసుధార టెన్షన్ పడుతుంది. అదే సమయంలో అటెండర్ శైలేంద్ర కి ఫోన్ చేసి మీరు చెప్పింది అంతా చేశాను రేపటికల్లా వాళ్ళ బాగోతం కాలేజీలో అందరికీ తెలుస్తుంది అని చెప్తాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. అటెండర్ మాట్లాడటం వసుధార వింటుంది.
వాడు మాట్లాడుతున్నది శైలేంద్ర తోనేనా అని అనుకుంటుంది. అటెండర్ ఫోన్ పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగేసరికి వసుధార ఉండటం చూసి షాక్ అవుతాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అటెండర్ ని అడుగుతుంది వసుధార. నీకెందుకు అని పొగరుగా మాట్లాడుతాడు అటెండర్. అతని దగ్గర ఫోన్ లాక్కుంటుంది వసుధార. సెక్యూరిటీని పిలవటంతో కంగారుగా అటెండర్ అక్కడ నుంచి పారిపోతాడు.
అప్పుడు అతని ఫోన్లో ఫోటోలు చూసి షాక్ అవుతుంది శైలేంద్ర కి ఫోన్ చేసి ఇదంతా చేస్తున్నది శైలేంద్ర అని కన్ఫామ్ చేసుకుంటుంది. శైలేంద్ర తో మాట్లాడుతూ నీ కక్ష ఇంకా తీరలేదా అయినా వదలడం లేదు. అయినా నువ్వు రిషి సర్ ని ఏమి చేయలేవు అంటుంది వసుధార. ముందు మాట్లాడుతున్నది వసుధార అని గుర్తుపట్టలేక పోతాడు శైలేంద్ర. తర్వాత మాట్లాడుతున్నది వసుధార అని తెలుసుకొని షాక్ అవుతాడు.
నేను ఎండి సీట్ కోసం ఏమైనా చేస్తాను రిషి ని వదలను అని చెప్తాడు శైలేంద్ర. ఆరోజు నా దగ్గర సాక్ష్యం లేదు కానీ ఈరోజు ఈ ఫోనే సాక్ష్యం ఎలాగైనా రిషి సార్ ని రక్షించుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పసుధార. వసుధారకి బాబాయ్ కి తెలిసిపోయింది ఇంకెవరికి భయపడవలసిన పనిలేదు. పిన్నికి చెప్పే రిషి ని లేపే పని చేస్తాను ఎలా అడ్డుకుంటుందో చూస్తాను అని జగతి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర.
నా కొడుకుని ఏమీ చేయలేవు అంటుంది జగతి. మీ శిష్యురాలు కూడా ఇలాగే మాట్లాడింది అయినా ఏం చేస్తానో చూస్తూ ఉండండి. ఆల్రెడీ ప్లాన్ అమలైపోయింది రేపటికల్లా నాకు గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. అదే విషయాన్ని మహేంద్ర కి ఫోన్ చేసి చెప్తుంది జగతి. రానీ వాడిక్కడికే కదా రావాలి. రిషిని ఏం చేయాలన్నా నన్ను దాటుకునే చేయాలి. అలా జరగనివ్వను రిషి ని ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర.
ఇంతలో వసుధార మహేంద్ర కి ఫోన్ చేసి అటెండర్ సంగతి అంతా చెప్తుంది. దాంతోపాటు రిషి సర్ నా మాట వినిపించుకోలేదు అని కూడా చెప్తుంది. నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర. మరోవైపు రిషి ఫ్లెక్సీలు దగ్గరికి వెళ్లి కాలేజ్ ఫ్లెక్సీలు గురించి మాట్లాడుతూ ఉంటే ఫ్లెక్సీలు అతను ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా అని తన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపిస్తాడు. షాక్ అవుతాడు రిషి ఇది మీకు ఎక్కడివి అని అడుగుతాడు.
విష్ కాలేజీ అటెండర్ ఇచ్చాడు అని చెప్తాడు షాప్ అతను. వాటిని డిలీట్ చేసేయండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఫస్ట్ ఆ డేటా అంత డిలీట్ చేసేయండి. ఫ్లెక్సీలు తీసుకోవడానికి అతనిని ఇక్కడికి రమ్మనండి అని చెప్తాడు రిషి. అలాగే సార్ పెళ్లిళ్లకి ఫ్లెక్సీలు తగిలించుకోవడానికి ఇచ్చాడేమో అనుకున్నాను అని చెప్పి అటెండర్ కి ఫోన్ చేస్తాడు షాప్ అతను. కానీ ఫోన్ వసుధార దగ్గర ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకునే లోపు అటెండర్ వసుధారని తోసేసి ఫోన్ లాక్కొని పారిపోతాడు.
షాప్ అతను అటెండర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీరేమీ కంగారు పడకండి ఫ్లెక్సీలు తీసుకోవడానికి అతను ఇప్పుడు వస్తాడు అని చెప్పాడు. సరే ముందు మీరు ఆ డేటా క్లియర్ చేసేయండి నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.