Brahmamudi: అన్నలపై ఫైరవుతున్న రుద్రాణి.. కృష్ణమూర్తి మాటలకు షాకైన రాహుల్?

Published : Jun 13, 2023, 12:45 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయించిన ఒక పెళ్ళికొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Brahmamudi: అన్నలపై ఫైరవుతున్న రుద్రాణి.. కృష్ణమూర్తి మాటలకు షాకైన రాహుల్?

ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ తూలుతూ ఉండడాన్ని గమనించి బేరర్ ని పిలిచి ఏం జరిగింది అని అడుగుతాడు ప్రకాష్. ఎక్కడో పొరపాటు జరిగింది మీకోసం కలిపిన డ్రింక్ జ్యూస్ లు ఎవరో వాళ్ళకి ఇచ్చారు అని చెప్తాడు బేరర్. బేరర్ ని  మందలిస్తాడు ప్రకాష్. పద త్వరగా వెళ్లి అక్కడ మేనేజ్ చేయాలి అని కావ్య వాళ్ళ దగ్గరికి వస్తారు ప్రకాష్ వాళ్ళు.

29

అప్పటికే మత్తులో ఉన్న రుద్రాణి నాకు నా కొడుక్కి అన్యాయం చేసి మీరందరూ పండగ చేసుకుంటున్నారు మీరు అన్నలా దున్నలా అంటూ ప్రకాష్ సుభాష్ మీద ఫైర్ అవుతుంది. మమ్మీ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మామలిద్దరికీ సారీ చెప్పి తల్లిని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాడు రాహుల్. ఆ తర్వాత మైకేల్ ని పక్కకు పిలిచి ఎన్ని అవకాశాలు వచ్చినా కిడ్నాప్ చేయడం లేదు.
 

39

అసలు నువ్వు చేయగలవా లేదా చెప్పు అంటూ ఫైర్ అవుతాడు రాహుల్. నేను అదే పని మీద ఉన్నాను మీరు ఈ విషయం మర్చిపోండి అని చెప్పి రాహుల్ ని పంపించేస్తాడు మైఖేల్. ఈ పని నీ కోసం కాదు నా రసగుల్లా అని నా సొంతం చేసుకోవటం కోసం సిన్సియర్గా చేస్తాను అని మనసులో అనుకుంటాడు మైఖేల్. మరోవైపు టీ తాగుతున్న రుద్రాణిని అంత ప్రశాంతంగా టీ తాగుతున్నావేంటి జరిగేది నీ కొడుకు పెళ్లి అంటుంది అపర్ణ.

49

పెళ్లి చేయటానికి మీరందరూ ఉన్నారు కదా అంటుంది రుద్రాణి. మధ్యలో మాదేముంది ఆకాశానికి నిచ్చెనవేసింది నువ్వు కాలు జారింది నీ కొడుకు అంటూ కౌంటర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. మరోవైపు స్వప్న ఆకలి వేస్తుంది అనటంతో ఇవ్వటానికి టైం అవుతుంది ఇప్పుడు వద్దు అంటుంది కనకం. అప్పుడే టిఫిన్ తో లోనికి వస్తుంది కావ్య. అక్క ఆకలికి ఉండలేదు కదా అమ్మ అని చెప్పి స్వప్నకి టిఫిన్ ఇచ్చి ముహూర్తం టైం కి తినేయమని చెప్పి తల్లిని పెద్దమ్మని అక్కడ నుంచి తీసుకువెళ్లి పోతుంది కావ్య.
 

59

మరోవైపు రాహుల్ ని పెళ్ళికొడుకుని చేస్తూ అతను మూడీ గా ఉండడం గమనిస్తాడు రాజ్. నీ గిల్టీనేస్ అర్థమైంది తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు కానీ నువ్వు స్వప్న మెడలో తాళి కట్టి ఆ తప్పుని దిద్దుకుంటున్నావు అంటాడు రాజ్. నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను సారీ అంటాడు రాహుల్. వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కోపంతో రగిలిపోతుంది రుద్రాణి.

69

రాజ్ ని తాతయ్య పిలుస్తున్నారని చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత కొడుకుతో నేను టెన్షన్ తో చచ్చిపోతుంటే ఇక్కడ నువ్వు కులాసాగా కబుర్లు చెప్తున్నావా అంటూ కేకలు వేస్తుంది. దానికోసం నువ్వు ఏమి టెన్షన్ పడకు స్వప్న అసలు పెళ్లి పీటల మీదకే రాదు ఆ తర్వాత సీన్ క్రియేట్ చేయవలసింది మాత్రం నువ్వే అంటూ మాట్లాడుకుంటారు తల్లి కొడుకులు.

79

మరోవైపు పెళ్ళికొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అని పంతులుగారు చెప్పడంతో మేనమామల్ని పంపిస్తుంది ధాన్యలక్ష్మి. రాహుల్ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత పెళ్లికూతురుని కూడా తీసుకు రమ్మంటారు పంతులుగారు. అప్పటికే స్వప్న గదిలోకి వెళ్లిన మైఖేల్ నువ్వు పెళ్లి చేసుకునేది నన్నే ఆ రాహుల్ ని కాదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ పిచ్చిపిచ్చిగా ఉందా అంటుంది స్వప్న. లేదు అని చెప్పి మత్తుమందు ఆమె మొహానికి తగిలించి స్పృహ కోల్పోయేలాగా చేసి ఆమెని కిడ్నాప్ చేస్తాడు మైకేల్. ఆ తర్వాత రూమ్ లోకి వచ్చిన కావ్య వాళ్ళకి స్వప్న కనిపించకపోవడంతో కంగారుపడి ఇంట్లో వాళ్లకి చెప్తారు. 

89

 మీ అక్కకి ఇది అలవాటే కదా అంటే వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. పాత పురాణాలు తవ్వొద్దంటూ మందులు ఇస్తాడు సీతారామయ్య. మీ అబ్బాయికి ఈ పెళ్లంటే ఇష్టం లేదు తనే ఏమైనా చేసి ఉండొచ్చు కదా అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి మాటలకు షాక్ అవుతాడు రాహుల్. కావ్య కూడా రుద్రాణి మీద  కేకలు వేస్తుంది. తనను వెతికి తీసుకు వస్తానంటూ బయలుదేరుతుంది. ఇదో పిచ్చిది ఎక్కడ ని వెతుకుతుంది అని భార్యని తిట్టుకుంటాడు రాజ్.

99

తరువాయి భాగంలో మీ అందరి బలవంతం మీద పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు స్వప్న వస్తుందో రాదో తెలియదు కాబట్టి పెళ్లిని క్యాన్సిల్ చేయమంటుంది రుద్రాణి. స్వప్నను వెతకటం కోసం కారులో బయలుదేరుతారు కావ్య దంపతులు. స్వప్న తలకి గన్  గురిపెట్టి పీటల మీద కూర్చోబెడతాడు మైఖేల్.

click me!

Recommended Stories