Karthika Deepam: కోటేష్ బిడ్డకు దిష్టి తీసిన రుద్రాణి.. వారణాసిని బతిమాలుతున్న సౌందర్య!

Navya G   | Asianet News
Published : Dec 22, 2021, 08:54 AM ISTUpdated : Dec 22, 2021, 08:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Karthika Deepam: కోటేష్ బిడ్డకు దిష్టి తీసిన రుద్రాణి.. వారణాసిని బతిమాలుతున్న సౌందర్య!

మోనిత (Monitha) తన బాబు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచిస్తూ బాధపడుతుంది. ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని అసలు వదిలే ప్రసక్తే లేదని అనుకుంటుంది. అంతలోనే అక్కడికి ఆదిత్య, శ్రావ్య (Sravya) రావటంతో వాళ్లను తన మాటలతో రెచ్చగొడుతుంది.
 

29

బాబు పదేపదే ఏడవటంతో శ్రీవల్లి (Srivalli) ఎంత ఊరుకో పెట్టినా ఊరుకోడు. కార్తీక్ వెళ్లి బాబుని తీసుకొని ఎత్తుకోవడంతో బాబు ఊరుకుంటాడు. శ్రీవల్లి, హిమ (Hima), సౌర్య చూసి ఆశ్చర్యపోతారు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో టిప్స్ చెబుతాడు.
 

39

శ్రీవల్లి (Srivalli) పిల్లల గురించి ఇంత బాగా చెబుతున్నారు అని అనేసరికి వెంటనే సౌర్య మా నాన్న డాక్టర్ అని చెప్పబోతుంటే కార్తీక్ (Karthik) ఆపుతాడు. నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని అలా తెలుసు అని సరిదిద్ది చెబుతాడు.
 

49

మళ్లీ బాబు శ్రీవల్లి (Srivalli)  చేతికి వెళ్లగానే ఏడుస్తాడు. ఇక పిల్లలు బాబు మళ్ళీ ఏడుస్తున్నాడు మని మళ్లీ మీరు ఒక్కసారి ఎత్తుకొండి నాన్న అనేసరికి బాబు ఊరుకుంటాడు. ఎంతైనా తన వారసత్వం కదా. ఇక అప్పుడే కోటేష్ (Kotesh) వచ్చి కాసేపు మాట్లాడుతాడు.
 

59

ఇక బాబు ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మరోవైపు దీప (Deepa) ఒంటరిగా నడుచుకుంటూ గతంలో రుద్రాణి చేసిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ (Karthik) కు తన బంగారం గురించి నిజం తెలియకుండా దాచి పెట్టాలనుకుంటున్నాని అనుకుంటుంది.
 

69

కోటేష్, శ్రీవల్లి బిడ్డను తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. దీప (Deepa), కార్తీక్ ల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అప్పుడే వారికి ఎదురుగా కారులో రుద్రాణి (Rudrani) రావడంతో వారిని పిలిచి వారికి వార్నింగ్ ఇస్తుంది.
 

79

ఇక బిడ్డని చూపించమని అనడంతో.. రుద్రాణి (Rudrani) బిడ్డను చూసి డబ్బులతో దిష్టి తీస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళపై ఆధారపడకండి అంటూ మాట్లాడుతుంది. మరోవైపు కార్తీక్ (Karthik) ఒంటరిగా నడుచుకుంటూ రోడ్డుపై వెళతాడు. గతాన్ని తలచుకుంటూ ఏదో ఒక పని చేయాలని అనుకుంటాడు.
 

89

అంతలోనే వెనుక నుంచి ఓ వ్యక్తి డాక్టర్ బాబు (Doctor Babu) అని పిలుచుకుంటూ వస్తాడు. తన భార్యకు ఆరోగ్యం బాలేదని మందులు ఇవ్వమంటాడు. డాక్టర్ కూడా చూడటానికి నిర్లక్ష్యంగా కనిపిస్తుంటాడు. ఈ ఊర్లో మంచి డాక్టర్ లేడని ఆలోచిస్తాడు కార్తీక్ (Karthik).
 

99

ఇక సౌందర్య (Soundarya) వారణాసి తో దీప గురించి చాలా బాధపడుతూ మాట్లాడుతుంది. వాళ్ళ గురించి చెప్పమని బాధపడుతుంది. అప్పుడే మోనిత (Monitha) వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇక సౌందర్య మోనిత మాటలకు గట్టిగా క్లాస్ పీకుతుంది.

click me!

Recommended Stories