అల్లు అర్జున్, రష్మిక మందన్నాజంటగా నటించిన `పుష్ప` చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమా నాలుగు రోజుల్లో 203కోట్లు వసూలు చేసిందని టాక్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తిరుమతిలో గ్రాండ్ మాసివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఇందులో బన్నీ, రష్మిక, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్,సునీల్,అనసూయ వంటి వారు పాల్గొన్నారు.