#Sankranti2024: సంక్రాంతి పందెం 250 కోట్లు.. ఆ లెక్కలు

Published : Dec 31, 2023, 01:20 PM IST

ఈ సంక్రాంతి పండుగ రాకుండానే సినిమా కోడి పుంజుల పంచాయతీ మొదలైంది.  ఈ పంచాయతీలో ఎవరు గెలుస్తారో.. సంక్రాంతి బరిలో దిగి ఎవరు నిలుస్తారో వేచి చూడాల్సిందే!

PREV
16
#Sankranti2024: సంక్రాంతి పందెం  250 కోట్లు.. ఆ లెక్కలు
Sankranthi 2024

 సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ  సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే పెద్ద స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ 2024 సంక్రాంతికి కూడా నువ్వా..నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా మొదలవుతోంది.  సంక్రాంతి ఫెస్టివల్‌ అయిన తర్వాత లాంగ్‌ రన్‌లో ఎన్ని రోజులు బజ్‌ ని కొనసాగిస్తూ కలెక్షన్స్‌ రాబడుతుంది అనేది మూవీ ఏ రేంజ్‌ హిట్‌ అనేది తెలుస్తుంది. అమెరికాలో అగ్రహీరోల సినిమా సక్సెస్‌ అయితే నాన్‌ బాహుబలి రికార్డులను అందుకోవడానికి ఛాన్సుంటుంది. అయితే ఈ సంక్రాంతి బరిలో నువ్వా నేనా అనే సినిమాలు నిలుస్తున్నాయి.   

ఈ సినిమాలు స్టేక్ మొత్తం 250 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో గుంటూరు కారం చిత్రం 100కోట్లు బిజినెస్ చేసింది. మిగతా సినిమాలు అన్ని కలిపి మరో 150 కోట్లు దాకా బిజినెస్ చేసాయని తెలుస్తోంది. ఇక  నైజాం ఏరియాలో మూడు సినిమాలు (గుంటూరు కారం, నా సామి రంగా, సైంధవ్ )  డిస్ట్రిబ్యూట్ చేస్తున్న  దిల్ రాజుకే ఎక్కువ స్టేక్ ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా మొత్తం సినిమాలకు వెనక్కి ఎంత వస్తుంది. 250 కోట్లు ఒకరే తెచ్చేయగలుగుతారా...ఈ సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈలోగా ... అసలు ఏ సినిమాకు ఏ మేరకు క్రేజ్ ఉందో చూద్దాం. 

26

ఈ వరసలో మొదటిగా సంక్రాంతి బరిలో దిగనున్న సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం. జనవరి 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‍లో వస్తున్న మూడో చిత్రమే గుంటూరు కారం (Guntur Kaaram). ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ సినిమాను 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, మహేశ్ బాబు లుక్స్ మాత్రం తెగ ట్రెండ్ అయ్యాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.   
 

36

 ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‍లో వస్తున్న మరో చిత్రం హనుమాన్ (Hanu Man Movie). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక హనుమాన్ టీజర్ గ్లింప్స్ అయితే ఆదిపురుష్ విజువల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయని టాక్ వచ్చింది. హనుమాన్ సినిమా  జనవరి 12న అంటే సంక్రాంతి బరిలో నిలిపారు. 

46

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎస్.మణికందన్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.  

56
Eagle

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ లు రెండు ప్లాఫ్ లు ఒక హిట్ అన్నట్లుంది. అయినా  హిట్లు ప్లాప్స్ అని చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో  రవితేజ నటించిన మరో చిత్రం ఈగల్ (Eagle Movie) సంక్రాంతి బరిలోకి దిగనుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది.  

66

నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న  చేస్తున్న సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆగస్ట్ 29న ఆయన పుట్టినరోజు (Nagarjuna Birthday) సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పాట సైతం రిలీజ్ చేసారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.   ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. 
 

click me!

Recommended Stories