నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ బేస్ ఇప్పుడు విడిపోయింది. నందమూరి బాలయ్య వర్గం, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వర్గంలా తయారైంది. టీడీపీలో కొంత మంది బాలయ్యకి, మరికొంత మంది తారక్ ఫ్యామిలీకి షిఫ్ట్ అయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. అంతేకాదు ఇటీవల కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, వచ్చే ఏపీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ అనేది తాము ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే వాళ్లు `టీడీపీ`తో లేరనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. ఈ రెండింటి మధ్య చైతన్యకృష్ణ కొట్టుకుపోయాడని తెలుస్తుంది. కానీ ఒక నందమూరి హీరో సినిమాకి ఇలా జరగడం విచారకరం.