బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి... ఆ కంటెస్టెంట్ పై పుస్తకం రాసిన అభిమాని!

Published : Dec 31, 2023, 12:44 PM ISTUpdated : Dec 31, 2023, 01:19 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్ పై  అభిమానులు ప్రేమ చాటుకున్నాడు. ఏకంగా పుస్తకం రాసి బహుమతిగా ఇచ్చారు. చరిత్రలో మొదటిసారి ఇలా జరిగింది.   

PREV
16
బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి...  ఆ కంటెస్టెంట్ పై  పుస్తకం రాసిన అభిమాని!
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ స్టార్స్ అయిపోతారు. అంతకు ముందు ముక్కు మొహం కూడా తెలియని వారు కూడా సెలెబ్రిటీలు అవుతారు. 

26

కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు. సోషల్ మీడియా వార్స్ కూడా కామన్. అంతటి పాపులారిటీ ఈ షోకి ఉంది. అయితే ఒకరి మీద పుస్తకం రాయడం మాత్రం ఇదే మొదటిసారి. 

 

36

చరిత్రలో మొదటిసారి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద పుస్తకం రాశారు అభిమానులు. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ చౌదరి మీద ఫ్యాన్స్ వినూత్న రీతిలో ప్రేమ చాటుకున్నారు. కొందరు అభిమానులు రాసిన లెటర్స్ పుస్తకంగా తయారు చేసి అమర్ కి ఇచ్చారు. నా మీద పుస్తకమా అని అమర్ దీప్ ఆశ్చర్యపోయాడు.

46

స్టార్ మా పరివార్ షోలో అమర్ దీప్ పాల్గొన్నాడు. అమర్ దీప్ వేదిక మీదకు రాగానే ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. నువ్వు రన్నర్ అయితే మాకు విన్నరే అన్నారు. అనంతరం అభిమానులు రాసిన పుస్తకాన్ని శ్రీముఖి చూపించింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

56

అమర్ దీప్ షోలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. చెప్పాలంటే అతడి అమాయకత్వం, తెలివి తేటలు, బలహీనతలు ఈ షో వేదికగా   బయటపడ్డాయి. అతడు రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది. 

 

66

అలాగే అమర్ దీప్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఓడిపోయినప్పుడల్లా ఏడుస్తూ పరువు తీసుకున్నాడు. చివరి నాగార్జున దయతలచి కెప్టెన్ చేశాడు. అయినప్పటికీ అమర్ దీప్ కి సీరియల్ నటుడిగా ఫ్యాన్ బేస్ ఉంది. ఆ కారణంగా రన్నర్ గా నిలిచాడు. 

click me!

Recommended Stories