RRR Movie: భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిగా చరణ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు? ఎలా నిర్ణయించారు?

Published : Apr 04, 2022, 08:11 PM IST

ఇద్దరు టాప్ స్టార్స్ చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై ప్రకటన నాటి నుండే అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు సమానంగా ఉంటాయా? లేదా ఒకరి పాత్ర డామినేట్ చేసేలా ఉంటుందా? స్క్రీన్ స్పేస్ విషయంలో రాజమౌళి (Rajamouli)ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వంటి అనేక సందేహాలు నెలకొన్నాయి.

PREV
16
RRR Movie: భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిగా చరణ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు? ఎలా నిర్ణయించారు?


అందులోనూ ఫ్యాన్ రైవల్రీ ఉన్న నందమూరి-మెగా హీరోలు కావడంతో ఈ స్క్రీన్ స్పేస్, ప్రాధాన్యత అనేవి చాలా ఆసక్తికరంగా మారాయి. తీరా సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. కొమురం భీం కంటే రామ్ చరణ్(Ram Charan) పాత్ర సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. కొమురం భీమ్ పాత్ర అనుకున్న స్థాయిలో రాజమౌళి తీర్చిదిద్దలేదనేది మెజారిటీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

26


మరోవైపు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. నార్త్ ఇండియా ఆడియన్స్ తో పాటు తమిళ ఆడియన్స్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా ట్వీట్స్ వేయడం నిజంగా ఎన్టీఆర్ పాత్రకు న్యాయం జరగలేదన్న స్పష్టత ఇస్తుంది. ఐతే కొందరు ఈ వాదన కొట్టిపారేస్తున్నారు. సినిమాలో చరణ్, ఎన్టీఆర్(NTR)అద్భుతంగా చేశారు. రాజమౌళి చాలా బాగా రెండు పాత్రలు బ్యాలన్స్ చేసి తెరకెక్కించారని అంటున్నారు. 
a

36


కాగా సినిమా విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్రప్రసాద్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ పాత్రలోనే చాలా షేడ్స్ ఉంటాయి. అది ఒక క్లిష్టమైన పాత్ర అన్నారు. సినిమా చూసిన వారు కూడా అదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 

46


ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) ఎన్టీఆర్, చరణ్ లతో చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాక భీమ్, అల్లూరి పాత్రల ఎంపిక ఎలా జరిగిందనేది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని భీమ్ గా, చరణ్ ని అల్లూరిగా నిర్ణయించడానికి కారణం చెప్పారు. 

56


కథ, అల్లూరి, కొమురం భీమ్ పాత్రల స్వభావం ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందట. ఆయన మాట్లాడుతూ... రామరాజు పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించేవారు. కానీ రామ్ చరణ్ మాత్రం భీమ్ పాత్ర పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయేవారు.  ఎందుకంటే ఆ పాత్ర కి కావాల్సిన మొరటుతనం చరణ్ లో లేవు. సినిమా మొదలు పెట్టే ముందు కూడా ఈ డిస్కషన్స్ జరిగాయి, అని అన్నారు.  
 

66

భీమ్ లాంటి అమాయకమైన మరియు వైల్డ్ పాత్రలో ఎన్టీఆర్ నటన బాగుంటుందని అలానే కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించగల రామ్ చరణ్ రామరాజు పాత్రకి బాగా సెట్ అవుతారని ఆ నిర్ణయం తీసుకున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. కారణం ఏదైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రాజమౌళి పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయారు. చరణ్ కంటే ఎన్టీఆర్ మంచి నటుడనే కోణంలో ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ఎలివేషన్స్ ఇచ్చినప్పటికీ.. వాళ్ళ అసహనం మాత్రం తగ్గేది కాదు.

click me!

Recommended Stories