మెగా ఫ్యామిలీపై `గని` హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్.. చిరు, పవన్‌, బన్నీ, వరుణ్‌ల గురించి ఓపెన్‌..

Published : Apr 04, 2022, 07:59 PM IST

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. కానీ `గని` హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌ కి మాత్రం ఆ విషయం తెలియదట. తాజాగా ఆమె మెగా ఫ్యామిలీ గురించి, చిరు, పవన్‌, బన్నీ, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ల గురించి ఓపెన్‌ అయ్యింది. 

PREV
16
మెగా ఫ్యామిలీపై `గని` హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్.. చిరు, పవన్‌, బన్నీ, వరుణ్‌ల గురించి ఓపెన్‌..

దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. `దబాంగ్‌3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌ `ఏషియానెట్‌` ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. 
 

26

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీపై సయీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `గని` సినిమా చేయడానికి ముందు తనకు మెగా ఫ్యామిలీ గురించి తెలియదని పేర్కొంది. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ ఇలా వీరంతా సపరేట్‌ హీరోలని అనుకుందట. అంతా ఒకే ఫ్యామిలీ హీరోలనే విషయం తెలియదని పేర్కొంది. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్టు పేర్కొంది సయీ. 

36

టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, పవన్‌, రామ్‌చరణ్‌ అంటే ఇష్టమని చెప్పింది. తెలుగు సినిమాలు కూడా చూస్తానని,  రామ్‌చరణ్‌ నటించిన `మగధీర` ఎంతో బాగా నచ్చిందని, అలాగే బన్నీ నటించిన `పుష్ప` సినిమాకి ఫిదా అయిపోయినట్టు పేర్కొంది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయినట్టు పేర్కొంది. ఆయన నటించిన `వకీల్‌సాబ్‌` చూశానని తెలిపింది. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తానని పేర్కొంది. టాలీవుడ్‌పై తనకు మంచి రెస్పెక్ట్ ఉందని పేర్కొంది. 

46

`గని` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసి ఆనందానికి లోనయ్యానని, అదొక ఫ్యాన్‌ మూవ్‌మెంట్‌ అని, లోలోపల ఎగిరి గంతేసినట్టు పేర్కొంది. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించింది. అంతేకాదు `దబాంగ్‌ 3` ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదని చెప్పింది. 

56

`గని` సినిమా గురించి చెబుతూ ఇది కేవలం బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే స్పోర్ట్ చిత్రం మాత్రమే కాదని, ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయని పేర్కొంది. బాక్సింగ్‌ కంటే ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయని పేర్కొంది. ఇందులో తాను మాయ పాత్రలో నటించినట్టు చెప్పింది. ఈ పాత్ర రియల్‌ లైఫ్‌లో తనకు చాలా దగ్గరైన పాత్ర అని పేర్కొంది. అందుకే కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయినట్టు పేర్కొంది. వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించడం బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది. ఆయన గురించి ముందు ఆలోచన విధానం వేరేలా ఉందని, సెట్‌లో వర్క్ చేసేటప్పుడు ఎంత కూల్‌ పర్సనో అర్థమైందని, సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిపింది. కిరణ్‌ కొర్రపాటి మంచి సినిమా తీశారు. నిర్మాతలు బాబీ, సిద్దు బాగా చూసుకున్నారని పేర్కొంది. 

66

తాను అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉందని, తనకు ఎలాంటి లిమిట్స్ లేవని చెప్పింది. అదే సమయంలో ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేదని, వచ్చిన ఆఫర్స్ లో మంచి ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తానని పేర్కొంది. గ్లామర్‌ షో విషయంలో తాను సిద్ధమే అని, పాత్ర డిమాండ్‌ మేరకు, కథ డిమాండ్‌ మేరకు చేస్తానని వెల్లడించింది. అలియాభట్‌ తనకు ఫేవరేట్‌ యాక్ట్రెస్‌ అని, ఆమె నుంచి ఇన్‌స్పైర్‌ అవుతానని పేర్కొంది. `గని` సినిమాపై హోప్స్ తో ఉన్నానని, ప్రస్తుతం `మేజర్‌` సినిమాలో నటిస్తున్నానని పేర్కొంది సయీ మంజ్రేకర్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories